రైలు పట్టాల వద్ద వృద్ధురాలిని కాపాడిన పోలీసులు

0
54

– కొడుకులను పిలిచి కౌన్సిలింగ్

తూర్పుగోదావరి జిల్లా తునిరైల్వేస్టేషన్లో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓవృద్ధురాలు ఒడిగట్టింది..
అదేసమయంలో డ్యూటీలోఉన్న జిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మోహన్. కానిస్టేబుల్ గణేష్ .పరుగులుతీస్తూ ఆ వృద్ధురాలు ప్రాణాలు కాపాడారు.

విశాఖజిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన సుబ్బయ్యమ్మ ఆర్థిక పరిస్థితులు సరిగ్గాలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలియజేశారు. తుని గవర్నమెంట్ రైల్వే ఎస్సై అబ్దుల్ మారూప్ వృద్ధురాలు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం పంపించినట్లుగా పోలిసులు తెలిపారు.