– హెర్ మెజస్టీ అంటూ దేశ పతాకాన్ని దేశంలో , ఎందుకు సగం అవనతం చేయాలి?
– బ్రిటిష్ వారు నిర్మించిన ఉన్నత అచ్చాదన ఆవరణ క్రింద, నేతాజీ విగ్రహం పెడతారా?
మన తెలుగుగడ్డ, గుంటూరు సీమ కొల్లూరు కోహినూర్ వజ్రాన్ని కిరీటంలో ధరించే ఆవిడ, ఏరోజూ మనదేశాన్ని పాలించలేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడ రాణి అయ్యారు. ఆవిడ తండ్రి జార్జి 6 మనని ఆగష్టు 15, 1947 ముందు పాలించారు, బ్రిటిష్ పార్లమెంటు ద్వారా. హైదరాబాదు, మైసూరు అన్నీ బ్రిటిష్ వారి రాణి గారికి లోబడి పని చేసే, సంస్థానాలుగా చెప్పుకోవాలి తప్ప, సర్వ స్వతంత్రమైన సంస్థానాలు కానీ, రాజ్యాలు గాని కావు. బ్రిటిష్ ప్రొటెక్టెడ్ స్టేట్స్ గానే అవి ఉండేవని చాలా మందికి తెలియదు. అందువలన బహుళంగా భారతదేశాన్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా యూరోపియన్ దేశాలు కొన్ని శతాబ్దాల పాలించాయి.
ఆవిడ ఎప్పుడూ అనుచితంగా వ్యాఖ్యలు చేయలేదు, నిజమే, జలియన్ వాలాబాగ్ వచ్చినప్పుడు శిరస్సు నేలకు స్థూపానికి ఆనించి, శ్రద్దాంజలి తెలిపారు. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకున్న, చేసిన అకృత్యాలకు బహిరంగ/బేషరతుగా క్షమాపణ ఏనాడూ చెప్పలేదు. అయితే కామన్వెల్త్ లో ఉన్నాము నేడు కూడా. ఎలిజబెత్ రాణి గారి మరణానికి సంతాపం.
1858 ముందు జాయింట్ స్టాక్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ మనని పాలించింది. చెప్పలేని ద్రోహాలు, దోపీడీలు చేసింది. ఈ కొన్ని దశాబ్దాలుగా వెస్ట్ ఇండియా కంపెనీ దేశం పై పడలేదా? తెల్ల దొరల క్రింద బానిసలుగా పోయి, గోధుమరంగు బాచ్ వద్ద మనం బానిసలుగా తయారౌతున్నామా ? ముఖ్యంగా మన తెలుగుజాతి, ద్రావిడుల పరిస్థితి దాస్యులుగా తయారౌతున్నామా?
బానిస చిహ్నాలు అని జార్జి గారి విగ్రహం మాత్రం తీసేసి .. అదే బ్రిటిష్ వారు నిర్మించిన ఆ ఉన్నత అచ్చాదన ఆవరణ క్రింద, నేతాజీ విగ్రహం పెట్టి.. బానిస అవశేషాలు తొలగిస్తున్నాం ఒక్కోటీ అంటున్నారు. అదేమిటి మోదీజీ? సరే.. మరి ఎల్లుండి సర్వ సత్తాక గణతంత్ర రాజ్యం ఇండియా 11న, అధికారికంగా ఆవిడ మృతికి సంతాపంగా state mourning ( ప్రియమైన వ్యక్తి మరణానికి విచారం వ్యక్తం చేయడం) ఎందుకు అనౌన్స్ చేశారు మోదీజీ? హెర్ మెజస్టీ అంటూ.. నా దేశ పతాకాన్ని దేశంలో , ఎందుకు సగం అవనతం చేయాలి హోమ్ శాఖా మాత్యులు అమితంజీ?
– శ్రీనివాస్