Suryaa.co.in

Telangana

అసోం సీఎంపై దాడికి కేసీఆర్‌దే బాధ్యత

– ఈ దాడి పథకం ప్రకారమే జరిగింది
– కేసీఆర్ గవర్నర్ ను తీవ్రంగా అవమానిస్తున్నారు
– రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు
– రాజ్యాంగ బద్దంగా వచ్చిన పదవులు అని మర్చిపోతున్నారు
– బేగంపేట విమానాశ్రయంలో అస్సాం ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన ఈటల రాజేందర్

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ . ఏమన్నారంటే.. ప్రజల విశ్వాసాలను, పండుగలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎన్నడూ లేనివిధంగా ఈసారి గణపతి నిమజ్జనం విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు అంటూ గందరగోళ పరిస్థితిని కెసిఆర్ కల్పించాడు. చివరికి ప్రజల ఆగ్రహంకి తల ఒగ్గి అనుమతించారు.

ఈ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి వారికి పూర్తి రక్షణ, గౌరవం కలిగించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ ఉత్సవంలో స్వయంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు పథకం ప్రకారం ఆయనను అగౌరవపరిచారు. ఇది అత్యంత హీనమైన చర్య. మీరు కూడా.

రేపు బీహార్, యూపీ, ఇతర రాష్ట్రాలకు పోతారు.. ఇలాంటి సంస్కృతి మంచి సంప్రదాయం కాదు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడినీ కేసీఆర్ నే ప్లాన్ చేసినట్టుగా మేం భావిస్తున్నాం. దీనికి పూర్తి భాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. ఇది పిరికిపందల చర్య. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటివి చేస్తారు. టీఆర్ఎస్ కి పోయే కాలం వచ్చింది అందుకే పవిత్ర గణేష్ నిమజ్జన కార్యక్రమం లో ఇలాంటి పనులు చేస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం అన్నీ గమనిస్తున్నారు. దీనికి తగిన బుద్ది చెప్తారు.

చిల్లర మాటలు మాట్లాడే వారిలో కెసిఆర్ కి మించిన వారు లేరు. అంత సంస్కార హీనంగా, పద్దతి లేకుండా ఎవరు మాట్లాడరు. టిఆర్ఎస్ పార్టీ ప్లాన్డ్ గా ఇలాంటి పనులు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్న తరువాత ఇలా జరుగుతుంది అంటే ఇది ప్రభుత్వం కావాలని చేస్తుంది.

గవర్నర్ కి ఉండే అధికారాలు వారికి, ప్రభుత్వానికి ఉండే అధికారాలు వారికి ఉంటాయి. పరస్పరం గౌరవించుకోవాలి. కానీ కేసీఆర్ అన్ని సంస్థలను అపహస్యం చేశారు. నేను తప్ప ఇక్కడ ఎవరూ ఉండవద్దు అనుకుంటారు. ఆ సీఎం ను ప్రమాణస్వీకారం చేయించేది గవర్నర్ నే అని మర్చిపోతున్నారు. సీఎం అయిన, గవర్నర్ అయిన రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులు తప్ప.. వారి కుటుంబం ద్వారానో, వంశపారంపర్యంగా నో వచ్చిన పదవులు కావు అని కేసీఆర్ మర్చిపోతున్నారు.

కెసిఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా ఉండదు, కానీ కెసిఆర్ అహంకారంగా వ్యవహరించి లేకుండా చేశారు.ఎం దుకు లేకుండా చేశారు అని మేము ప్రశ్నిస్తే మొత్తం సెస్సన్ బహిష్కరించారు. మా హక్కులు కాలరాశారు. స్పీకర్ కూడా మమ్ముల్ని బయటకి పంపించడం నీచమైనది. ఇది చాలా బాధాకరం. అన్నిరకాల రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేయకుండా, గౌరవంగా మసలుకోవాలి అని కెసిఆర్ కి సూచన చేస్తున్న. లేదంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా , ఆయనను ఇంటికి పంపించడం ఖాయం అని ఈటల రాజేందర్ అన్నారు.

LEAVE A RESPONSE