-శోభా యాత్రలో కేసీఆర్ , కుటుంబ సభ్యులుగానీ ఎక్కడా పాల్గొనలేదు
-టీఆర్ఎస్ నేతపై తక్షణమే అరెస్ట్ చేసి, హత్యా యత్నం కేసు పెట్టాలి
-ముఖ్యమంత్రులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానని చెప్పడం హాస్యాస్పదం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య. హిందువుల సంఘటిత శక్తిని చాటుతూ, భారత దేశంలోనే అత్యద్భుతమైన శోభాయాత్రగా సాగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి , ముఖ్య అతిథిగా వచ్చిన అసోం సీఎంను గౌరవించాలనే కనీస సోయి కూడా లేకుండా టీఆర్ఎస్ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటు.
మెడలో టీఆర్ఎస్ కండువా వేసుకుని, టీఆర్ఎస్ నాయకులను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎట్టా రానిచ్చారు? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా? ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్న సీఎం కేసీఆర్ కు కేంద్రం భద్రత కల్పించకపోతే స్వేచ్ఛగా వెళ్లగలిగేవారా? బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా?
గణేష్ నిమజ్జన శోభా యాత్రలో కేసీఆర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఎక్కడా పాల్గొనలేదు. లక్షలాది మంది పాల్గొనే శోభాయాత్రలో పాల్గొనేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిథిని అడ్డుకుంటే పరువు పోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటు.
భారత దేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో అసోంను అభివృద్ధి చేసి చూపిస్తున్న గొప్ప వ్యక్తి హేమంత బిశ్వ శర్మ. అవినీతి రహిత పాలనతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న నాయకుడు. ఆయన నుండి నేర్చుకోవాల్సింది పోయి, టీఆర్ఎస్ గూండాలను పంపించి, దాడి చేయించే కుట్ర చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం.
సీఎం పై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై తక్షణమే అరెస్ట్ చేసి, హత్యా యత్నం కేసు పెట్టాలి. ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలి. గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో అడుగడుగునా అడ్డంకులు స్రుష్టిస్తూ హిందువుల పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ చేసిన కుట్రలను హిందువులంతా తిప్పికొట్టారు. లక్షలాదిగా శోభాయాత్రలో పాల్గొని కేసీఆర్ చెంప చెళ్లుమన్పించేలా హిందువుల సంఘటిత శక్తిని మరోసారి చాటిచెప్పారు.
ఇతర రాష్ట్రాల నాయకులను, ముఖ్యమంత్రులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానని చెప్పడం హాస్యాస్పదం. కమ్మ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నేత ఎర్నేని రామారావుపైనా టీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 70 ఏళ్ల పైబడ్డ పెద్ద మనిషిపై కమ్మ సంఘం భనవంలోనే మూకుమ్మడిగా టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం అత్యంత దారుణం. స్థానిక మంత్రి ప్యానెల్ ను, ఎర్నేని రామారావు ఓడించడాన్ని జీర్ణించుకోలేక స్థానిక మంత్రి అనుచరులమని చెప్పుకుంటూ దాడి చేయడం సిగ్గు చేటు. బీజేపీ నేతలను చూస్తేనే టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోంది.
ప్రజా స్వామ్యయుతంగా ఎదుర్కోలేక , ఇట్లాంటి దాడులు చేయడం హేయమైన చర్య. ఎర్నేని రామారావుకు, ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది. దాడులకు పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. దాడికి పురిగొల్పిన నాయకులపై కేసు నమోదు చేయాలి.