– కూల్చివేతలకు..నిర్మాణాలకు అదే తేడా
– ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది
( భూమా బాబు)
సరిగ్గా 6 ఏళ్ల క్రితం… ఇదే రోజు మొట్టమొదటి, చివరి సారిగా గంటన్నర కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. ఐదేళ్లలో నేరుగా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశం అదొక్కటే.
ఆ తరువాత అదే రోజు అమరావతిలోని కృష్ణానది కరకట్టపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజావేదికను జగన్ కూల్చివేశారు.
కూల్చినా కసితీరలేదు. తీవ్రంగా మానసికంగా భాధపెట్టేలా కొంత తగలబెట్టి వదిలేశారు. అక్కడి నుండి ఆ శకలాలు కూడా తియ్యలేదు. చూసినప్పుడల్లా జగన్ భయానక పైశాచికత్వం గుర్తుకు రావాలని వదిలేశారు.
సుమారు రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కన్వెన్షన్ హాల్‌ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాల నిర్వహణకు ఉపయోగించేది.
ప్రజావేదిక కూల్చివేత అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కక్ష సాధింపు చర్య అని టీడీపీ ఆరోపించగా, నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని వైసీపీ సమర్థించుకుంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచిపోయింది.
ఇవ్వాళ అది ఒక స్మారక చిహ్నంగా ప్రజాలకోరిక మేరకు వుంచేశారు. జగన్ లాంటి సైకో కుర్చీ ఎక్కితే ఏమవుతుందో తెలియడానికి గుర్తుగా అలాగే వుంచి.. అడవిలా మారిన అమరావతిలో ముళ్లపొదలు నరికి, శుభ్రం చేసి పనులు మొదలెట్టారు.
ఈ ఏడాదిలోనే.. రెండేసి రోజుల సుదీర్ఘ మూడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అమరావతిలో పెట్టి, లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యంత వేగంగా అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు.