– పార్టీ వర్గాల హర్షం
విజయవాడ: కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పి-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్‌గా ఆర్ధికనిపుణుడు సి.కుటుంబరావు నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘకాలంగా టీడీపీకి సేవలందిస్తున్నారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కుటుంబరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు. కుటుంబరావు నియామకంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సమర్ధుడైన వ్యక్తికి పి-4 అమలు బాధ్యత అప్పగించడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కుటుంబరావు తెరవెనుక కీలక పాత్ర పోషించారు.