విశ్వగురుకు మాత్రమే ఆ అర్థం తెలిసుండాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా స్పందించారు. రైతు చట్టాలు, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, సీఏఏ, ఎల్పీజీ ధరలతో పాటు అగ్నిపథ్‌పై ఆయన ట్విటర్‌ వేదికగా కేంద్ర నిర్ణయాలను తప్పుబట్టారు. ‘‘వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం కావు. జీఎస్టీ వ్యాపారులకు అర్థం కాదు. పెద్ద నోట్ల రద్దు సామాన్యులకు అర్థం కాదు. సీఏఏ ముస్లింలకు అర్థం కాదు. ఎల్పీజీ ధరలు గృహిణులకు అర్థకాదు. ఇప్పుడు అగ్నిపథ్‌ యువతకు అర్థం కాదు. కేవలం విశ్వగురుకు మాత్రమే ఆ అర్థం తెలిసుండాలి’’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Leave a Reply