Suryaa.co.in

Telangana

పంటల నష్టాలపై ప్రతిపక్షాల రాజకీయాలు

-చివరకు అన్నదాతను వదలని ప్రతిపక్షాల అధికార దాహం
-కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నారా?!
-కానీ రాష్ట్రంలో మాత్రం రైతులకు న్యాయం చేసినట్టు రాద్ధాంతాలు చేస్తారు
-దేశంలోనే రైతులను ఆదుకున్నది ఒక్క కెసిఆర్ గారు మాత్రమే
-దేశంలో రైతుల కోసం ఇంతగా చేస్తున్న సీఎం ఉన్నారా?!
-దేశాన్ని ఉద్ధరిస్తామంటున్న బిజెపి, కాంగ్రెస్ లు దేశంలో రైతులకు ఏం చేశాయి?!
-రైతులను ఆదుకున్నది ఒక కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే!
-ఈ సారి కూడా పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తాం
-ఈ రెండు మూడు రోజుల్లో నర్సంపేట కు సీఎం కెసిఆర్ వచ్చే అవకాశం
-స్వయంగా పంట నష్టాలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
-ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా పంట నష్టాలు – ఇందులో ఎక్కువ నష్టపోయింది నర్సంపేట నియోజకవర్గమే!
-2021-22 లో అకాల వర్షంతో పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట, మార్చి 21: ప్రతిపక్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రైతు నష్టాలపై కూడా రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు తమ దిక్కుమాలిన తనాన్ని బయటపెట్టుకున్నాయని విమర్శించారు. అధికార దాహంతో అన్నదాతను కూడా వదలకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారా? తెలంగాణ తరహా పథకాలను అమలు చేస్తున్నారా? రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వాళ్ళ దివారా కోరుతున్నాను గుర్తించారని మంత్రి అన్నారు.

వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలో గత ఏడాది (2021-22లో) అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప పంట రైతులకు నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై 8,89,43,054 రూపాయల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం పంట పొలాలకి మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతుంటే, రైతు బంధుతో అదుకుంటున్నది మన తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటలు నష్టపోతే సర్వే చేసి నష్ట పరిహారం ఇస్తున్నారా..? అక్కడ ఇవ్వరు కానీ ఇక్కడ మాత్రం ప్రజలను మభ్యపెడుతున్నారు అని అన్నారు. రాష్ట్రాన్ని కో నీతి ప్రాంతాన్ని కో నీతి ఉంటుందా?! అని విమర్శించారు. ప్రకృతి ప్రకృతి రైతులు తీవ్రంగా నష్టపోగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టం నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కువగా జరిగింది అన్నారు.

అధికారులు ఈ సారి కూడా నష్టపోయిన పంటలను సర్వే చేసి నివేదికల అందిస్తారని, ఆ నివేదికలు రాగానే రైతులను కచ్చితంగా ఆదుకుంటాం అన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో సీఎం కేసిఆర్ గారు నర్సంపేటకు వచ్చి నష్టపోయిన పంటలను పరిశీలించే అవకాశం ఉంది అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నష్టపోయిన రైతుల పక్షాన నిలబడి పంటలను సర్వే చేయిస్తున్నారు అన్నారు. రైతు నష్ట పోకూడదని పంట కొంటున్న ప్రభుత్వం నష్ట పోయిన రైతులను సీఎం కేసిఆర్ గారు, మన ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE