Suryaa.co.in

Telangana

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం

– ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవు
– పిల్లి శాపాలకు ఉట్లు తెగవు
– పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. దీనిని గమనించి కేసీఆర్ 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారు.

వాళ్లు ముందు జూరాల నుండి మొదలుపెట్టాలి అని వాదించారు. వాళ్లు తర్వాత అటవీ ప్రాంతం అని ఫిర్యాదులు పెట్టారు. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదులు చేశారు.తర్వాత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు .. అనంతరం రైతుల పేరు మీద కేసులు వేయించారు.అన్ని విజ్ఞాలను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారు.జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉన్నది.

రీ డిజైన్ చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే ఉన్నాయి.తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద కేసీఅర్ గారు దృష్టిపెట్టారు.కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నది తుంగభద్ర బేసిన్. శ్రీశైలం నుండి పాలమూరు రంగారెడ్డి చేపట్టడం మూలంగా ఈ నీరు కూడా అందుబాటులో ఉంటుంది.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద వీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవు.పిల్లి శాపాలకు ఉట్లు తెగవు.

వీరికి పాలమూరుకు నీళ్లు రావాలి, ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడాలి అన్నదానికన్నా ప్రాజెక్టు విఫలం కావాలి అన్న ఆకాంక్ష ఎక్కువగా ఉన్నది.ప్రాజెక్టు నిర్మాణంలో ఏవయినా అవరోధాలు వస్తే నీళ్లొస్తే బాగుపడతారు అని ప్రజలను జాగృతం చేసి సహకరించాలి .. లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.తెలంగాణ ఎత్తిపోతల పథకాలు అన్నీ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి గారి నేతృత్వంలో పనులు నడుస్తున్నాయి.పెంటారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 250 కి పైగా మోటార్లు బిగించబడ్డాయి.

ఇతర దేశాల నుండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు. కానీ సుధీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీరు, తెలంగాణ గర్వించదగిన ఇంజనీరు అయిన పెంటారెడ్డి గారి మీద కూడా వీరు బురదజల్లుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం ఇప్పుడు విషం చిమ్ముతున్న నాయకులు విస్మరించడం గమనార్హం.

మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నాం.60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా కేసీఆర్ గారి నాయకత్వంలో నిలదొక్కుకుంటున్నది.పాలమూరుకు నీళ్లొస్తే మీ రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని విషప్రచారం చేస్తున్నారు.

LEAVE A RESPONSE