అరుణాచలేశ్వర స్వామి వారి దైవ సన్నిధి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచల హిల్స్ దగ్గర ఉన్న శివాలయం. ఈ ఆలయం పంచభూతాల్లో అగ్నితత్వ లింగం. పురాణ కథనం ప్రకారం .. మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం రోజున అగ్ని రూపంలో శిలగా ఉద్భవించారని ప్రతీతి.ఇక్కడ ఈ పర్వతాన్శే భగవత్ స్వరూపంగా భక్తులు భావిస్తారు.
భక్తులు 14 కిలోమీటర్ల దూరం ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తూ భక్తితో కొలుస్తారు. ప్రతి పౌర్ణమికి దాదాపు పది లక్షల మంది భక్తులు ,కార్తీక పౌర్ణమి రోజున అయితే 50 లక్షల మంది గిరిప్రదక్షిణ నిర్వహిస్తారు. చిత్ర పౌర్ణమి నాడు కూడా లక్షలాదిమంది భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహిస్తారు.
ఈ గిరి ప్రదక్షణ సమయంలో 14 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతంలో కొలువైయున్న ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణ లింగం, సూర్య లింగం, ఆది అన్నామలై లింగం, వాయు లింగం, కుబేర లింగం, చంద్ర లింగం, ఈశాన్య లింగం, అగ్ని లింగాలు ఉండి భక్తులచే కొలవ బడుతుంటాయి.
ఇక చరిత్రకి వచ్చినప్పుడు 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. తొమ్మిది గోపురాలు, నాలుగు దిక్కుల నాలుగు ముఖద్వారాలు కలిగి ఉండి ఈ ప్రాంగణంలోనే అనేక మండపాలు,అష్ట వినాయకులు,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి , అమ్మవారు తదితర ఉప ఆలయాలు కూడా నిర్మించబడి ఉన్నాయి. ఈ ఆలయం 9వ శతాబ్దం చోళుల కాలంలో ప్రాశస్యములోకి వచ్చినది.
తర్వాత విజయనగరం ప్రభువులైన సంగమ ,సాలువ , తులవ వంశం వారు ఈ దేవాలయంను అభివృద్ధి పరిచి ప్రాశస్యమునకు కారకులయ్యారు. ప్రసిద్ధి పొందిన ఈ అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈరోజు మేము దర్శించుకుని అభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు
దగ్గుబాటి పురందేశ్వరి
(మాజీ మంత్రి)