Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ – నారా లోకేష్ కృతజ్ఞతలు

ఉండవల్లి: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఏపీ టీపీవో అసోసియేషన్ ప్రతినిధులు రూ.2లక్షల విరాళం అందజేశారు.

అలాగే, టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 1,13,216 విరాళం, జేబీ ఎస్టేట్స్ అధినేత జే.పాండురంగారావు రూ.లక్ష, డాక్టర్ బి.హనుమయ్య రూ. 84,000, మెగా టౌన్ షిప్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.64,700, కేఎస్ నాగమణి రూ.50,116 విరాళం అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇండోవేదిక్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు ఎంఆర్ కే రెడ్డి రూ.లక్ష, తిరువూరు నియోజకవర్గం చీమలపాడుకు చెందిన బెజవాడ శంకర్ రూ.50,117, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎస్.హేమ రూ.50 వేల విరాళం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE