– ఎమ్మెల్యే సంజయ్ పై మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలేదు?
– కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి బ్రోకర్ల కంటే హీనంగా మారింది
– గంగా రెడ్డిని హత్య చేసి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బహుమతి ఇచ్చింది
– తెలంగాణ పైసలు వయానాడ్ కు హెలికాప్టర్ లో ప్రియాంక గాంధీకి ఇచ్చి వస్తున్నారు
– ప్రభుత్వంలో ఉండి రెడ్ బుక్ ఎట్లా పెడతారు?
– బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారు. హామీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు
రేవంత్ రెడ్డి లాగులో వంద తొండలు ఇడుస్తారు. ఓటు ద్వారా ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం.
జగిత్యాలలో స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హత్య చేయించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్నారు. జగిత్యాల ఎస్పీ ఎమ్మెల్యే సంజయ్ పై మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలేదు? మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం సంజయ్ మారు గంగారెడ్డిని తన అనుచరుడితో హత్య చేయించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సంజయ్ నారాయణరెడ్డి పేరును ప్రపోజల్ చేశారు. ఎమ్మెల్యేపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?
నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు. గాంధీ భవన్ లో జరిగే కాంగ్రెస్ మీటింగ్ కు ఎమ్మెల్యే ఎందుకు హాజరయ్యారు రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి బ్రోకర్ల కంటే హీనంగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయడం లేదు? పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాక తప్పదు.
రేవంత్ రెడ్డి హోంమంత్రి గా ఉంటే రాష్ట్రంలో మర్డర్లు జరుగుతున్నాయి. మేము అధికారంలోకి వస్తే మొత్తం బయటపెడతాము. కరీంనగర్ జిల్లాలో 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోశారు. గంగా రెడ్డిని హత్య చేసి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బహుమతి ఇచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు.
రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని అనుకుంటోంది?సీఎం,మంత్రులు టూర్లలో బిజీగా ఉన్నారు. ప్రజలు అయోమయంలో ఉన్నారు. సీఎం ఢీల్లి,కేరళ టూర్లు తిరుగుతున్నారు.
మంత్రులు పొంగులేటి, పొన్నం సౌత్ కొరియా టూర్లు. మంత్రి తుమ్మల మలేషియా టూర్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెలికాప్టర్ కోసం గొడవలు పడుతున్నారు.
తెలంగాణను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వదలం యాదగిరి గుట్ట టెంపుల్ బయట మేము ఫోటో షూట్ చేశాము. ఈవో పర్మిషన్ తీసుకున్నాకే ఫోటో షూట్ తీశాము. కేసీఆర్ కట్టించిన యాదాద్రి టెంపుల్ ప్రపంచానికి తెలియాలని ఫోటో షూట్ చేశాము. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సీట్లు ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ పైసలు వయానాడ్ కు హెలికాఫ్టర్ లో తీసుకువెళ్లి ప్రియాంక గాంధీకి ఇచ్చి వస్తున్నారు. ఏ అధికారి ఓవర్ యాక్షన్ చేసినా వారి పేర్లు రాసుకుంటాము. తెలంగాణ కేసీఆర్సీఎం కాక తప్పదు. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండ్ అయ్యారు.
ప్రభుత్వంలో ఉండి రెడ్ బుక్ ఎట్లా పెడతారు? పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ లో దొరికిన 700 కోట్ల డబ్బు దొరికిన విషయాన్ని బాంబ్ పేల్చుతారేమో. పొంగులేటి రేవంత్ రెడ్డికి ఎప్పుడు బాంబ్ పెడతారో అని వేచి చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ లేదు.