Suryaa.co.in

Food & Health

కీళ్లలో నొప్పి మరియు గుజ్జు శక్తి పెరగడానికి ..

వైద్య నిలయం సలహాలు
1.-కీళ్లలో గుజ్జు శక్తి పెరగడానికి
జువ్వి పండ్లు ( ప్లక్ష వృక్షము) ఎన్ని దొరికితే అన్ని తెచ్చి వారిని రెండేసి ముక్కలుగా చేసి బాగా ఎండ బెట్టాలి. బాగా మందంగా వున్న కుండను శుద్ధి చేసి బాగా కడగాలి. కుండను తేమ లేకుండా బాగా ఎండబెట్టాలి.
ఆ కుండలో ఎండిన పండ్లను పోసి అవి మునిగేంతవరకు తేనె పొయ్యాలి. ఎండిన జువ్వి పండ్లు తేనెను పీల్చుకుంటాయి. మరలా మునిగే వరకు తేనె పోయాలి.
కుండ మీద మూకుడు బోర్లించాలి. ఒక గుడ్డకు బంక మట్టిపూసి కుండలోకి గాలి చొరబడకుండా
మూకుడు, కుండ కలిసే చోట సీల్ చేయాలి. ఆ కుండను గాలి తగలని .చోట ఒక మూలగా 30 రోజులు ఉంచాలి. అది బాగా మగ్గి హల్వా లాగా తయారవుతుంది.
దీనిని ప్రతి రోజు ఒక అర టీ స్పూను తీసుకొని తింటూ వుంటే కీళ్లలో గుజ్జు పెరగడమే కాక వీర్య వృద్ధి, శక్తి
వృద్ధి జరుగుతుంది.

కీళ్లలో గుజ్జు అరిగిపోతే — పెరగడానికి
తుమ్మ బంకను తెచ్చి రెండు చుక్కలు నెయ్యి వేసి వేయించి , దంచాలి . దానికి సమానంగా కలకండ పొడిని కలపి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు ఉదయం , సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున తిని పాలు తాగాలి
ఈ విధంగా చేయడం వలన కీళ్ళ మధ్య అరిగిపోయిన గుజ్జు బాగా పెరుగుతుంది .

LEAVE A RESPONSE