Suryaa.co.in

Telangana

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకం

-శక్తివంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇది మంచి వేదిక
-సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువు
-మోదీ నాయకత్వంలో దేశ గతిని మార్చే సంస్కరణలు
– కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో జరిగిన వాణిజ్య వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సులో మంత్రి పీయుష్ గోయల్ తో కలిసిపాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: భారత్ ను మళ్లీ విశ్వగురుగా మార్చేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో జరిగిన వాణిజ్య వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సులో మంత్రి పీయుష్ గోయల్ తో కలిసిపాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ..ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు మధ్య నిర్మాణాత్మకమైన చర్చకు ఈ వేదిక చాలా కీలకమైంది.

ఇలాంటి నిర్మాణాత్మక చర్చల ద్వారానే అందరి భాగస్వామ్యంతో దేశ భవిష్యత్తుకు బాటలు పడతాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే క్రమంలో.. మనకు ఎదురయ్యే సవాళ్ల గురించి భారతీయ కార్పొరేట్ కంపెనీలతో చర్చించేందుకు, వినూత్న ఆలోచనలు పంచుకోవడానికి, శక్తివంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇది మంచి వేదిక.

పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధికి మన హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంది. పురోభివ్ర్ఢ్హికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంది. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో స్పష్టంగా రుజువైంది. హైదరాబాద్ లో తయారైన వ్యాక్సిన్ యావత్ ప్రపంచంలో కరోనా భయాన్ని తొలగించింది.

మన దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా, విశ్వ గురు గా తీర్చిదిద్దడానికి మన స్టార్టప్ లు సాంకేతికంగా అద్భుతమైన పురోభివృద్ధిని సాధించాయి. ప్రైవేట్ రంగం భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిరమైన ఆర్థిక ప్రగతిని సాధ్యమవుతుంది.

ఉద్యోగాల కల్పన, ఎగుమతులు పెంచడానికి, ప్రపంచంతో మన దేశం పోటీ పడటానికి మీ పెట్టుబడి, వినూత్న ఆలోచనలు కీలకమైనవి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో దేశ గతిని మార్చే సంస్కరణలు చోటు చేసుకున్నాయి.

GST, బ్యాంకింగ్ సంస్కరణలు, డిజిటైజేషన్ ను పరుగులు పెట్టించడం వంటి సంస్కరణలు దేశాన్ని వేగంగా ముందుకు నడిపించాయి.ప్రాడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీముల వల్ల అనేక రంగాల్లో స్థానికంగా ఉత్పాదకత పెరిగింది.

స్టార్టప్ కల్చర్ మన దేశ ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రాం లో భాగంగా అనేక R&D సంస్థలకు గ్రాంట్లు లభించాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీలో అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని మేం ప్రోత్రహిస్తున్నాం.

ప్రధానమంత్రి మార్గదర్శనంలో, 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తుంది.2015 నుంచి ప్రైవేటు రంగానికి అనేక ప్రోత్సాహకాలు అందించాం.

ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనకు అన్ని రంగాలకు అవసరమైన సహకారం అందిస్తున్నాం. మోదీ ప్రభుత్వం మీకు అండగా ఉంది. భారత్ ను మళ్లీ విశ్వగురువుగా చేసేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం చాలా కీలకం.

LEAVE A RESPONSE