హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీతను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, మాజీ తన్నీరు హరీష్ రావులు పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. సలహాలిచ్చారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో పాటు యూసఫ్ గూడ డివిజన్ కు చెందిన గొల్ల నర్సింగ్ రావుయాదవ్,ధనుష్ యాదవ్, లాలూ యాదవ్, రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన సికిందర్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల యువ నాయకుడు జేన్నాయికోడే జగన్మోహన్ తదితరులు కేటీఆర్, హరీష్ రావులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులు వారితో మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థి సునీతకు ఘన విజయం చేకూర్చడమే లక్ష్యంగా, ధ్యేయంగా మరింత అంకితభావంతో ముందుకు సాగుదామన్నారు.