– ప్రకాష్ రాజ్,ధృవ్ రాఠీ పేమెంట్ తోనే మాట్లాడారా
– పెయిడ్ బ్యాచ్ సీఎం,మంత్రులు
– పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి
– గురువు మొదలుపెట్టిన పేమెంట్ ను శిష్యుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు
– బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు
– 400 ఎకరాల భూమిపై చీకటి ఒప్పందం
– మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జిని ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్లదుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా,మీడియా, రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. విద్యార్థులు,యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ అంటేనే కేసులు,లాఠీఛార్జిలు. మంత్రులు అక్కసు వెళ్లగక్కి, విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు. పెయిడ్ బ్యాచ్ సీఎం,మంత్రులు. విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే కేసులు, లాఠీఛార్జిలు భరిస్తారా? పీసీసీ,సీఎం,మంత్రి పదవులు పేమెంట్ తోనే అవుతున్నాయని ప్రజలకు తెలుసు. పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. పేమెంట్లతోనే కాంగ్రెస్ నేతలకు పదవులు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ప్రజల నుండి వచ్చిన వాళ్ళు కాదు. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం హెచ్.సి.యూ విద్యార్థులకు అండగా నిలిచారు. కార్తీ చిదంబరం పేమెంట్ తోనే మాట్లాడారా? ప్రకాష్ రాజ్,ధృవ్ రాఠీ పేమెంట్ తోనే మాట్లాడారా? 2012 సెప్టెంబర్ 16న హెచ్.సి.యూ భూములు ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు ఇస్తే, కాంగ్రెస్, బిఆర్ఎస్ అడ్డం పడుతున్నాయని టీడీపీలో ఉండి రేవంత్ రెడ్డి అన్నారు. గురువు మొదలుపెట్టిన పేమెంట్ ను శిష్యుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు.
కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న జంతువులు చిత్రహింసలకు గురి అవుతున్నాయి. తమ బాధ్యత కాకపోయినా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి పోలీసులను అడ్డుకోవచ్చు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయి. కిషన్ రెడ్డి,బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలోకి రాకుండా పోలీసులను అడ్డుకోవచ్చు.
సెంట్రల్ యూనివర్సిటీ అధికారిగా వీసీ ఉంటారు. డ్రోన్ కేమెరాలతో జేసీబీ వీడియోలు తీస్తే ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు వుంటుంది. పార్కులను,అడవులను ప్రభుత్వం అమ్ముతుందా? సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ రెడ్డికి హక్కు లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదు. ఫోర్త్ సిటీలో,ఫ్యూచర్ సిటీలో భూమి ఇచ్చుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి?
గురువు లాగా అద్భుతమైన ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. 400 ఎకరాలు ప్రభుత్వానిది అయితే దొంగల్లాగా అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు? 400 ఎకరాల భూముల్లో ప్రభుత్వ పెద్దల చీకటి కోణం ఉంది. 400 ఎకరాల భూమిపై చీకటి ఒప్పందం ప్రభుత్వం చేసుకుంది. ఐటీ పార్కులు ఫోర్త్ సిటీలో ఎందుకు కట్టకూడదు? చాలా ఐటీ పార్కుల్లో స్థలం ఉంది.
గురువు రియల్ ఎస్టేట్ దందా కోసం భూమిని ప్రయివేటు వాళ్ళకు కట్టబెట్టారో, ఇప్పుడు శిష్యుడు అదే బాటలో నడుస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మూడు చెరువులు ఉన్నాయి. హైడ్రా,రంగనాధ్ ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. సేవ్ హెచ్.సి.యూ అనే స్లోగన్ కు ఐదు లక్షల మంది మద్దతు తెలిపారు. ఐదు లక్షల మంది పెయిడ్ బ్యాచేనా? బిఆర్ఎస్,కేటీఆర్పైన విషం కక్కడం ఎందుకు?
ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థులు చేసిన తప్పా? సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం రాహుల్ గాంధీకి తెలియడం లేదా? చెల్లింపుల కోసమే రాహుల్ గాంధీ మాట్లాడటం లేదా? హెచ్. సి.యూ లో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం ఆపాలి. పదేళ్ళల్లో మేము కోర్టుల్లో ఫైట్ చేయకుండా తీర్పు వచ్చిందా? కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని ఏంటి?
రైతు బంధు పేరు చెప్పి తెచ్చిన 10 వేల కోట్ల డబ్బులను కమీషన్లకు వాడుకుంటున్నారు. మాట్లాడిన వాళ్లంతా గుంట నక్కలేనా? గుంట నక్కలు అయితే జంతువులు కాదా. తెలంగాణలో మీ లాంటి గుంట నక్కలు ఉన్నాయి.
విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పల్ల ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్ పాల్గొన్నారు.