– అదానీ, అంబానీలకు భూములు అమ్ముతాం అంటే చూస్తూ ఊరుకోం
– శాంతియుతంగా నిరసనకు దిగిన హెచ్ సి యూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నాం
– మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: శాంతియుతంగా నిరసనకు దిగిన హెచ్ సి యూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ ను మాజి మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సర్కార్ అణిచివేతలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
“హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండ కొనసాగిస్తుంది. ఇదేనా రేవంత్ రెడ్డి మీరు చెప్పిన ప్రజా పాలన.రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడుతా అంటూ రాజ్యాంగం చేతులో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు. హెచ్‌సీయూ లో జరుగుతున్న భూముల అమ్మకాలు రాహుల్ గాంధీకి కనపడటం లేదా?.
ఎన్నికలప్పుడు హెచ్‌సీయూ కి వచ్చిన రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ఎం మాట్లాడారు. అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకంపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి. ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న తీరు ఏంటి ? మీ రెండు నాల్కల ధోరణి ని ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి. అదానీ, అంబానీలకు భూములు అమ్ముతాం అంటే చూస్తూ ఊరుకోం. హెచ్‌సీయూ అడవుల్లో అనేక జీవ జాతులు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి అవి ప్రభుత్వం చర్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయనీ పర్యావరణ వేత్తలు,విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మీరెన్ని నిర్బంధ కాండ లు కొనసాగించిన, లాఠీ చార్జీలు చేసిన పెద్దలకు దోచిపెట్టే మీ చర్యలను అడ్డుకోవడానికి విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.” అని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.