* హెచ్‌సీయూ విద్యార్ధులపై లాఠీఛార్జీ దారుణం
* విద్యార్ధుల నిరసనలు రాహుల్ గాంధీకి పట్టవా?
* వెంటనే భూముల వేలం మానుకోవాలి
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్భంద పాలన అని మరో సారి రుజువైందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేయోద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్ధులపై విచక్షణరహితంగా పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిచారు.
హెచ్‌సీయూ స్వర్ణోత్సవాల వేళ విద్యార్ధులకు, యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చే హామీలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పర్కార్ పర్యావరణానికి హాని చేటు చేసే నిర్ణయం దారుణమన్నారు. గతంలో ముంబైలోని ఆరే ఫారెస్ట్ గుండా ముంబై మెట్రో రైల్ ప్రాజెక్టు వెళితే పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి దానిని ఆపాలని చెప్పిన రాహుల్ గాంధీకి యూనివర్సిటీ పర్యావరణం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఛత్తీస్ గడ్‌లోని హస్ దేవ్ అరణ్యం బొగ్గు గనులను అదానీ ఇస్తే వేలాది చెట్లు తొలగించాలి కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనలు చేసిన రాహుల్ గాంధీకి యూనివర్సిటీ పర్యావరణం కనిపించడం లేదా అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయాన అప్పటీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేస్తే మళ్లీ పదేళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే యూనివర్సిటీల్లో విద్యార్ధుల మీద లాఠీ ఛార్జీకి తెగబడుతున్నాయని దుయ్యబట్టారు.
నాడు హెచ్‌సీయూకి వచ్చి విద్యార్ధులకు అండగా ఉంటానని చెప్పిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ఎందుకు విద్యార్ధుల ఆర్తనాదాలను పట్టించుకోవడం లేదన్నారు. సేవ్ హెచ్‌సీయూ అని యావత్ తెలంగాణ నినదిస్తుంటే కాంగ్రెస్ సర్కార్‌కు కనిపించడం లేదా అన్నారు. అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ తీయడం విద్యార్ధులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. విద్యార్ధులతో పాటు వారికి మద్దతు తెలిపిన అధ్యాపకుల మీద లాఠీఛార్జీ చేయడం దుర్మార్గమన్నారు.
ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ అణచివేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుందన్నారు. 150 ఎకరాల కంటే ఎక్కువ స్ధలంలో చెట్లు ఉంటే దానిని తొలగించడానికి అనుమతులు తీసుకోవాలనే వియాన్ని ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ప్రజలు వ్యతిరేకిస్తున్న హెచ్‌సీయూ భూములను ఎందుకు వేలం వేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు.