– లోకేష్ డిప్యూటీ సీఎం
– తనకు కలవచ్చిందన్న దర్శకుడు తమ్మారెడ్డి
హైదరాబాద్: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సినీ దర్శకుడు, సామాజిక అంశాలపై తరచూ స్పందించే తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పవన్ సీఎం అయినట్లు కలవచ్చిందంటూ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, లోకేశ్ డిప్యూటీ కావాలని ఇటీవల ఆయా పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ‘కూటమికి చంద్రబాబు ఛైర్మన్ గా ఉండి.. పవన్ ను సీఎం , లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేసినట్లు రాత్రి కల వచ్చింది. వాళ్లిద్దరూ విజయవంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని అనిపించింది. ఈలోగా మెలకువ వచ్చింది’ అని ఆయన మాట్లాడిన వీడియో వైరలవుతోంది.