– దళితబిడ్డను అవమానించడం దారుణం
– అది ప్రభుత్వానికి నష్టం, మా కులానికి అవమానం
– రేపు పవన్ మాటలు ఆయన శాఖ కు కూడా వర్తిస్తాయి.
– మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వని పవన్‌కు ఏం సామాజికన్యాయం చేస్తారు?
– కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు
– పవన్ ఆమెనే కాదు.. సీఎంనూ అవమానించారు
– హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని సీఎంను అన్నట్లే
– హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఫైర్
విజయవాడ: పవన్ కళ్యాణ్ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. ఆయన బహిరంగంగా మాట్లాడటం సరికాదు. మంత్రివర్గంలోనో , అంతర్గతంగా మాట్లాడుకోవాలి. అది దళిత బిడ్డను అవమానించడం. అది సీఎం పరిపాలన పైనే ఆ వ్యాఖ్యలు చేసినట్టు. అది ప్రభుత్వానికి నష్టం, మా కులానికి అవమానం.
ఎన్నికల కు ముందే పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాం.సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, మాదిగలకు ఎక్కడ న్యాయం చేశారు? జనసేన అంటే ఒకటి రెండు కులాల పార్టీ నా? అందరి పార్టీనా మూడు మంత్రి పదవుల తీసుకుని ఒక్కటీ కూడా బీసీ కి, ఎస్సీ లకు ఎందుకు ఇవ్వలేదు?
కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు.హోంమంత్రి ని అంటే ప్రభుత్వాన్ని అంటే సీఎం ను అన్నట్టే.హోంమంత్రి ని అనడమే కాదు.. సీఎం ను కూడా పవన్ అన్నట్టే. మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వని పవన్, సామాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతాడు? మాట్లాడే సమయం వచ్చినపుడు అన్ని విషయాలు మాట్లాడతాం.
టిడిపి, బిజెపి, జనసేన మూడు స్తంభాలైతే, నాల్గవ స్తంభం ఎమ్మార్పీఎస్. పని చేసి గెలుపు బాటలో నిలబెట్టింది. మేం ప్రభుత్వం లో భాగస్వాములం కాకపోయినా ఫలితం మా బిడ్డలకు దక్కాలి.మాదిగలు సంతృప్తి పడేలా భాగస్వామ్యం ఉండేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కేబినెట్ అంటే కుటుంబం. రేపు పవన్ మాటలు ఆయన శాఖ కు కూడా వర్తిస్తాయి.