Suryaa.co.in

Andhra Pradesh

సీఐ అంజూయాదవ్ పై శ్రీకాళహస్తిలోనే తేల్చుకోవడానికి వెళ్తున్న పవన్

– సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీకి వినతి పత్రం

నిరసన వ్యక్తం చేసన జనసేన పార్టీ కార్యకర్త పై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ వ్యవహారాన్ని కాళహస్తిలోనే తేల్చుకుంటానని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. అయితే అందరూ అక్కడ వారాహి విజయయాత్ర జరిగినప్పుడు తేల్చుకుంటారేమో అనుకున్నారు.

కానీ పవన్ మాత్రం.. వెంటనే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. సోమవారం ఆయన తిరుపతికి వెళ్తున్నారు. సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీకి వినతి పత్రం ఇవ్వనున్నారు.

శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 10.30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల మనోహర్ సూచించారు.

అయితే పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి కార్యకర్తను పరామర్శించేందుకు శ్రీకాళహస్తి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసులపై ఫిర్యాదు కావడంతో.. పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటనను అడ్డుకుంటారా..? లేకపోతే ఎస్పీ వినతి పత్రం తీసుకుంటారా అన్నది సందేహంగా మారింది.

LEAVE A RESPONSE