– చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అండగా జనసేనాని
– అన్నయ్యగా భావించి గౌరవించిన నారా లోకేష్
– కూటమి గెలుపు కోసం అన్నదమ్ముల్లా పోరాటం
– సోదర బంధంతో రాష్ట్రానికి మంచిరోజులు
అమరావతి: ఉరుముకి మెరుపు తోడైతే ప్రళయగర్జనలే. ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిను అక్రమ కేసులో అరెస్టు చేయించింది వైసీపీ సర్కారు. యువగళం పాదయాత్రలో ఉన్న తనయుడు నారా లోకేష్ తన తండ్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. అదే సమయంలో పవన్‌ను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. అయినా వెనక్కుతగ్గకుండా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నారా లోకేష్ న్యాయపోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేవరకూ మద్దతుగా నిలిచిన పవన్‌కళ్యాణ్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని నారా లోకేష్ ప్రస్తావిం చడం గమనార్హం. వైకాపా అరాచక పాలన అంతమే తన పంతమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాట ఇచ్చిన జనసేనాని, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనా లు దృష్టిలో ఉంచుకుని బీజేపీతోనూ పొత్తు కుదిర్చారు. పవన్, లోకేష్‌లు ఇద్దరూ ఇరుపార్టీల అగ్రనేతలుగా కాకుండా… కుటుంబం అనే రాష్ట్రాన్ని కాపాడు కోవడానికి ఎన్ని త్యాగాలకైనా, ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగి సొంత అన్నదమ్ముల్లాగే పనిచేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ, సభల నిర్వహణ లోనూ, మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణ స్పష్టంగా కనపడిరది. యువనేతల మధ్య సమన్వయం..పరస్పర గౌరవ భావం, సోదరబంధం రాష్ట్రానికి మంచిరోజులు తెచ్చాయి.