-వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేయడు
-వాపును చూసి బాబు బలుపు అనుకుంటున్నాడు
-మంత్రి జోగి రమేష్
తాడేపల్లి: ఇటీవల 21 స్థానాలకు నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచి చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైయస్ఆర్‌సీపీ 17 స్థానాల్లో గెలిచింది మరిచిపోవద్దన్నారు. 175 స్థానాల్లో గెలుస్తాం అని చంద్రబాబు అంటున్నాడు. ఆయనకు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరన్నారు. మళ్ళీ ప్రభుత్వంలోకి రావటం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలని ఇవాళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశా నిర్దేశం చేశారని మంత్రి చెప్పారు.
తాడేపల్లిలో జరిగిన గడపగడపకు కార్యక్రమం సమీక్ష అనంతరం మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. గృహ సారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తి చేసుకోవాలి.. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారన్నారు. వాలంటీర్లను, గృహ సారథులను మమేకం చేయాలి.. వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలంటూ జగన్ ఉద్బోధ చేశారని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు 25 రోజుల పాటు గడప గడప చేపట్టాలని చెప్పారు.
చంద్రబాబుకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దుమ్ము ఉందా? గెలిచే దమ్ము లేకే దత్త పుత్రుడు, సీపీఐ, సీపీఎం అందరూ రావాలని పిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం పార్టీతో ఉంటాడో అతనికే తెలియదని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏ సంజాయిషీ ఇవ్వటానికి ఢిల్లీకి వెళ్ళాడు? పవన్ చంద్రబాబు పంచన ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేయడని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.