పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో వేల కోట్లు దోచుకుంటున్నారు

-మీడియా సమక్షంలో వీళ్ల అక్రమాలు నిరూపించేందుకు సిద్దం- సాక్షి మీడియా కూడా రావాలి
-శ్రీలంకలో పాలకులకు పట్టిన గతే ఏపీలో జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు పడుతుంది
– నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నింటిలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, కానీ ఏమీ ఎరుగనట్టు స్వామిమాలలో ఉండి పచ్చి అబ్బద్దాలు చెప్పటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల ప్రజాదనం దోచుకుంటున్నారు. మైనింగ్ యజమానులు దగ్గర కమీషన్లు దండుకుంటున్నారు, ఒక వేళ కమీషన్లు ఇవ్వలేకుంటే మైనింగ్ లో వాటారాయించుకుంటున్నారు. ఇవి రెండు కుదరకపోతే వందల కోట్లు జరిమానాలు విధిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారికి ఏపీలో మైన్స్ ఉన్నాయి, వారు గత ఎన్నికల్లో వైసీపీకి ఆర్దిక సాయం చేశారు. చివరకు వారి దగ్గర కూడా కమీషన్లు దండుకుంటున్నారు. మాజీ మంత్రి శిధ్దా రాఘవరావుకు చెందిన మైనింగ్ కంపెనీకి రూ. 1000 కోట్లకు పైగా జరిమానా విధించి బెదిరింపులతో వైసీపీలో చేర్చుకున్నారు. చిత్తూరులో జిల్లాలో టీడీపీకి చెందిన మనోహర్ మైన్స్ కి కూడా జరిమానాలు విధించి వైసీపీలో చేర్చుకున్నారు. కుదిరితే కమీష్లు లేదంటే జరిమాలను విధించి మైన్స్ యజమానుల్ని పెద్దిరెడ్డి, మిదున్ రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారు.

పెద్దిరెడ్డి కనుసన్నల్లో చిత్తురు జిల్లా నుంచి ప్రతి రోజూ బెంగుళూరు, చైన్నైకి 300 ట్రిప్పర్ల ఇసుక వెళ్తోంది. మీడియా సమక్షంలో దీన్ని నిరూపించేందుకు మేం సిద్దం. సాక్షి, టీవీ9, ఎన్టీవీ ఎవరైనా రావొచ్చు. పెద్దిరెడ్డి, మిదున్ రెడ్డి అక్రమాలు నిరూపిస్తాం. ఉచిత ఇసుక రద్దు చేసి శేఖర్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకుని, అక్రమంగా తెలంగాణ, తమిళనాడు పోలీసులతో కుమ్మక్కయి ఇసుక దందా సాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో డంపులు పెట్టి అమ్ముకుంటున్నారు. కానీ సజ్జల మాత్రం ఇసుకను పేదల ఇళ్లు కట్టించేందుకు వాడుతుంటే చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటున్నారు. పేదలకు ఇళ్లెక్కడ తమిళనాడు, బెంగుళూరులో కడుతున్నారా? చెప్పటానికి సిగ్గుగా లేదా?

చిత్తూరు, పీలేరు, పుంగనూరు సహా రాష్ట్ర వాప్యంగా వేల కోట్ల విలువైన భూములు పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి కబ్జా చేశారు. తిరుపతిలో డీకేటీ భూములు ఎమ్మార్వో ఆఫీసులో రికార్టులు ట్యాంపరింగ్ చేశారు. నంద్యాలలోని ఎస్పీవై డిస్టలరీ లీజుకు తీసుకుని నాసికరం మద్యం తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తయారీకి రూ. 10 కూడా ఖర్చు కానీ మద్యాన్ని వందలాది రూపాయలకు అమ్ముతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ప్రతిసారీ పైన దేవుడున్నాడని జగన్ రెడ్డి అంటున్నారు. కానీ దేవుడుంది జగన్ రెడ్డికొక్కరికే కాదు, ప్రజలందరివైపు దేవుడున్నాడు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, పాపాలకు శిక్షించక మానడు. చిత్తూరు జిల్లాలో జరిగే ప్రభుత్వ కాంట్రాక్టు పనులన్నీ పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డివే. ఆ పనుల్లో నాణ్యత ఉండదు. ఎంబుక్ లు కూడా వాళ్లే నమోదు చేసుకుంటారు.

అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. పారెస్టుకు డిపార్ట్ మెంట్ లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల మీటర్లకు మోటార్లు పేరుతో కమీషన్లు దండుకుంటున్నారు. వైన్, మైన్, శాండ్, ల్యాండ్ డిస్టలరీలు, పారెస్ట్ అన్నింటిలోనూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ డబ్బులతో ఓట్లు కొని మళ్లీ అధికారంలోకి రావొచ్చన్న భావనలో జగన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా అలానే భావించారు. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఈటెల రాజేందర్ ని గెలిపించారు. ప్రజలు అమయాకులు కాదు, అవినీతి సంపాదనతో అధికారంలోకి రావాలంటే కుదరదు. శ్రీలకంలో పాలకులు ఏ గతి పట్టిందో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డిలకు అదే గతి పడుతుంది.

వైసీపీ అరాచకాలు ఇక సాగవు. ప్రజల్లో తిరుగుబాటు మెదలైంది. గతంలో ఎన్నడూ ఇంత అరాచక పాలనను చూడలేదు. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ రెడ్డి పాలన పట్ల సంతోషంగా లేరు. సజ్జల, వేమిరెడ్డి, పెద్దిరెడి, విజయసాయిరెడ్డి లాంటి ఓ పదిమందికి తప్ప వైసీపీ కింద స్ధాయి నాయకులకు ఈ పాలన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలెవరూ సంతోషంగా లేరు. ఏపీ పాలన గురించి తెలంగాణలో సైతం అసహ్యంగా మాట్లాడుతుతున్నారని వైసీపీ నేతలు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించి ఏం చేసుకుంటారు. చనిపోయాక పైన కూడా బ్యాంకులుంటాయనుకుంటున్నారా అని కిషోర్ కుమార్ అన్నారు.

Leave a Reply