– కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతల ఆనందం రెట్టింపు
:- ఎమ్మెల్యే సత్యానందరావు
కొత్తపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగవ నెల పెన్షన్ల పంపిణీ జాతరలా కొనసాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.ఒకటవ తారీకునే ఠంచనుగా పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని అన్నారు.