తాను చనిపోతూ తన అవయవాల ద్వారా 7 గురికి ప్రాణం పోసిన పెంటయ్య మహోన్నతుడు

Spread the love

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
– ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ పెంటయ్య చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో మరణం
– జీవన్ దాన్ ద్వారా పెంటయ్య అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులను అభినందించిన సంగప్ప

తన అవయవ దానం ద్వారా 7 గురి ప్రాణాలు కాపాడిన సిర్గాపూర్ BJYM మండల ప్రధాన కార్యదర్శి శ్రీ పెంటయ్య మహోన్నతుడు అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. సిర్గాపూర్ లో పెంటయ్య పార్థీవ దేహానికి సంగప్ప నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాల్సిందిగా భగవంతుడి ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ పెంటయ్య ను హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పటల్ లో చికిత్స అందించారు. ప్రతీ రోజు హాస్పిటల్ కు వెళ్లి సంగప్ప ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెబుతూ వచ్చారు. బ్రెయిన్ డెడ్ తో పెంటయ్య చనిపోయారు. ఆసుపత్రి యాజమాన్యం సలహా మేరకు కుటుంబ సభ్యులు పెంటయ్య అవయవ దానానికి ముందుకు రావడం గొప్ప విషయం అని సంగప్ప చెప్పారు.

సంగప్ప వెంట బిజెపి నాయకులు పీరప్ప, గోవింద్ పటేల్, రజినీకాంత్, సాయిరాం, గోపాల్ రెడ్డి, కాశీనాథ్ ముదిరాజ్, తదితరులు ఉన్నారు.

Leave a Reply