– రేవంత్.. బీఆర్‌ఎస్ ఆఫీసుకు వచ్చి ట్రైనింగ్ తీసుకోండి
– వారం రోజుల పాటు కేసీఆర్ చేత కోచింగ్ క్లాస్ లు తీసుకుంటే మంచిది
– నల్లమల్ల ఆంధ్రానా? తెలంగాణనా అని అధికారులను అడుగుతున్న అజ్ఞాని రేవంత్
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: నిన్న బనకచర్ల ప్రాజెక్ట్ పై, గోదావరి నదీ జలాల వినియోగం పై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం పై, మీడియా సమావేశంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన చౌకబారు వ్యాఖ్యలను ఖండిస్తూ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గోదావరి పై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తీసేలా ఆంధ్రా ప్రభుత్వం కుట్రపూరితంగా కడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ కు పై నిన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమావేశం ప్రజలకేదో నిజానిజాలు తెలియజేయడానికి, ఆంధ్రా ప్రభుత్వ కుట్రలు బట్టబయలు చెయ్యడానికి పెట్టినట్టుగా లేదు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తం కుమార్ రెడ్డి అలాగే మిగతా మంత్రివర్గం అంతా నీళ్ళ ప్రాజెక్ట్ ల పై, ఏది ఎక్కడుంది? దేనివల్ల ఎక్కడ నష్టం జరుగుతుందో తెలుసుకోవడానికి, అధికారులతో శిక్షణా తరగతులు నిర్వహించినట్టుంది.
అక్కడ అధికారులు చెప్తుంటే.. ఎక్కడ మీటింగ్ పెట్టిన తొడలు వాచిపోయేలా, నోరు బొంగురు పోయేలా అరిచి అరిచి నేను నల్లమల్ల అడవుల్లో పుట్టిన పులిని అనే రేవంత్ రెడ్డి.. అధికారులను నల్లమల్ల అడవి తెలంగాణ కిందికి వస్తదా? రాయలసీమ కిందికి వస్తదా అని అడుగుతాండు. అది వీళ్ల అవగాహన సామర్థ్యం.
కేటీఆర్ అంటే అన్నారు అంటరు. వారు అన్నట్టే నిన్న అధికారుల సమావేశంలో లైవ్ లోనే చిన్న పోరగాళ్లు అడిగే సందేహాలు రేవంత్ రెడ్డి అడుగుతూ అభాసుపాలు అయ్యాడు.
వీళ్లకు సాగునీటి ప్రాజెక్ట్ ల మీద అవగాహన కావాలన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం తెలియాలి అన్నా,బనకచర్ల ప్రాజెక్ట్ కట్టడం తెలంగాణ కి వాటిల్లే నష్టం తెలియాలి అన్నా వీళ్లు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో ఒక వారం రోజుల పాటు కేసీఆర్ చేత కోచింగ్ క్లాస్ లు తీసుకుంటే మంచిది. అప్పుడు సంపూర్ణ ఆవగాహన వస్తది.
సదుద్దేశ్యంతో, తెలంగాణ ప్రజయోజనాల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, నీటిపారుదల మంత్రికి, మొత్తం ప్రభుత్వానికి కోచింగ్ క్లాస్లు నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది.
ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు ని ఉరి తీయాలని అనడం చూస్తుంటే.. నీ బాధంతా సాగునీటి ప్రాజెక్టు లపై ప్రజలకు నిజా నిజాలు చెప్పడం కంటే, ఎక్కువ తెల్లారి పేపర్ లో మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో నీ వార్త ఉండాలన్న ఆరాటమే ఎక్కువ కనిపిస్తుంది. సంచలనాల కోసం, హెడ్డింగ్ ల కోసం, బ్రేకింగ్ న్యూస్ ల కోసం మాట్లాడటం తప్ప అక్కడ ముచ్చటలో పస లేనే లేదు.
తెలంగాణను తెచ్చి 10 ఏళ్లు అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్ ని ఉరి తీస్తా అని అన్నందుకు, వెంటనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు రాళ్ళతో కొట్టాలి. అతిత్వరలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలే దూలానికి పగ్గం కట్టి కుతికెకు తాడుకట్టి మంచినీళ్ళు కూడా అడగకుండా ఉరి తీసే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయ్.