Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ కు మునుగోడు ఎన్నికల ఫలితాలతోనే ప్రజలు వీఆర్ఎస్

– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

భారత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతంగా అత్యంత అవినీతి మోడల్ పాలనను చూపించిన దుర్మార్గుడు కేసీఆర్. 8 ఏండ్లలో అవినీతి ద్వారా సంపాదించిన పైసలతో కేసీఆర్ నేల మీద నిలబడటం లేదు. అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి అన్ని రాష్ట్రాల్లో గెలవాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నడు. అది ఎన్నటికీ సాధ్యం కాదు..

కేసీఆర్ 8 ఏండ్ల పాలన అట్టర్ ఫెయిల్యూర్. సచివాలయమే వెళ్లని సీఎంగా భారత చరిత్రలో కేసీఆర్ నిలిచిపోయిండు. జాతీయ పార్టీ పెట్టి ఇదే మోడల్ చూపించాలనుకుంటున్నారా? ప్రతి దానికి తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని కాలం గడిపిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామాకు సిద్ధమైండు. దొంగ దీక్ష చేసి తెలంగాణ ప్రజలను నమ్మించినట్లే భారతదేశ ప్రజలందరినీ నమ్మించాలని నాటకాలు షురూ చేసిండు.. కేసీఆర్…బీఆర్ఎస్ సంగతి దేవుడెరుగు… నీ టీఆర్ఎస్ పార్టీ అస్థిత్వమే పోయింది.

నాడు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలు ఛీ కొడుతుండటంతో, దేశ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ చేస్తున్న కొత్త డ్రామాలు ప్రజలకు అర్ధమైనయ్. బీఆర్ఎస్ కు మునుగోడు ఎన్నికల ఫలితాలతోనే ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వబోతున్నరు.

LEAVE A RESPONSE