జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజునుంచే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్

92

– ఏకారణంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్షనేతలు, తమకుగిట్టని వారి ఫోన్లు ట్యాప్ చేస్తుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ ఘటనకు నైతికబాధ్యతవహిస్తూ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాలి.
• రాష్ట్రప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యంచేసుకోవాలి
• చంద్రబాబు, లోకేశ్ ఇతర టీడీపీముఖ్యనేతల ఫోన్లు ఎప్పటినుంచి ట్యాప్ చేస్తున్నారో ముఖ్యమంత్రి బయటపెట్టాలి
• ప్రత్యర్థులను సాధించడంకోసమే జగన్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ ను నిత్యకృత్యంగా మార్చిందన్నది నిజంకాదా?
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంచేస్తున్న ఫోన్ ట్యాపింగ్ నిక్సన్ ప్రభుత్వాన్ని కూల్చిన మరో “వాటర్ గేట్” లాంటిదే
• మూడేళ్లతనపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంతమంది నేతల వ్యక్తిగతజీవితంలోకి చొరబడ్డారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలి?
• ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తివాస్తవాలతో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం
• గతంలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణ మీప్రభుత్వంపై ఉన్నది… ఇప్పుడు అదినిజమేనని ఒప్పుకుంటారా?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిత్యకృత్యంగా మారిందని, రాష్ట్ర హైకోర్ట్ ప్రధానన్యాయమూర్తిసహా, ఇతర జడ్జీలు, ప్రతిపక్షనేతల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నా రని గతంలోనే తాముచెబితే, ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం లేదని గగ్గోలుపెట్టిదని, మరిప్పుడు జగన్ తో సరిసమానమైన మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య నిలదీశారు.

బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ముఖ్యమైనమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముద్దాయిల్ని పట్టుకున్నట్టు చెప్పడం చాలాఅభ్యంతరకరమైన విషయం, తీవ్రంగా పరిగణించాల్సిన అంశంకూడా. ప్రతిపక్షనేతల ఫోన్లు ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని గతంలో తాము అంటే పాలకులుగగ్గోలుపెట్టారు. అమ్మలు, నాన్నలపై ఒట్లువేస్తూ, అబ్బెబ్బే తామేమీ ఎరుగమని తప్పించుకోవాలని చూశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముద్దాయిల్ని పట్టుకున్నట్టు చెప్పడం గతంలో తాముచెప్పిన దానికి ప్రబల నిదర్శమని తాముఅంటాము. రాష్ట్రప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డితో సరిసమానమైన మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డే స్వయంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినదగ్గరనుంచీ ఎంతమందివ్యక్తుల ప్రైవేట్ సంభాషణలు విన్నారో, ఎందరి వ్యక్తిగతజీవితాల్లోకి చొరబడ్డారోవెల్లడిస్తూ, పూర్తివాస్తవాలతో ఆయనే తక్షణం శ్వేతపత్రం విడుదలచేయాలి. ప్రభుత్వాలను కూలద్రోయాలనుకునేవారు, టెర్రరిస్టులు, సంఘవిద్రోహకార్యకలాపాలకు పాల్పడేవారి టెలిఫోన్లు మాత్రమే అదికూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేయాలి.

అలాకాకుండా జగన్ ప్రభుత్వం వ్యక్తిగతఅవసరాలకోసం ఇతరుల ఫోన్లు ట్యాప్ చేస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారడం..నిజంకాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకక్రిమినల్ ఇన్ స్టింక్ట్ తో పనిచేస్తోంది. బీజేపీ, వైసీపీ, టీడీపీ ఇతరపక్షాల నేతల ఫోన్లు ఎన్ని ట్యాపింగ్ లో ఉన్నాయి? ఇతరుల రహస్యసంభాషణలువినే ఈప్రభుత్వం నీచమనస్తత్వం కలిగిన క్రిమినల్ నాలెడ్జ్ తో నడుస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డిప్రభుత్వంచేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అనే పెద్దనేరం .

ఆనాడు అమెరికాలో నిక్సన్ ప్రభుత్వాన్ని కూల్చిన మరో “వాటర్ గేట్” లాంటిదే అనడం ఎంతమాత్రంఅతిశయోక్తి కాదు. మూడేళ్లతనపాలనలో జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ తో ఎంతమంది నేతల వ్యక్తిగతజీవితంలోకి చొరబడ్డారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో తక్షణమే బహిర్గతపరచాలి. గతంలోకూడా హైకోర్ట్ చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ఫోన్లుకూడా ట్యాప్ చేశారన్న ఆరోపణ వైసీపీప్రభుత్వంపై ఉన్నది… ఇప్పుడు అదినిజమేనని ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ఒప్పుకుంటారా?

ప్రతిపక్షనేత చంద్రబాబు, లోకేశ్ ఇతర టీడీపీముఖ్యనేతల ఫోన్లు ఎప్పటినుంచి ట్యాప్ చేస్తున్నారో ముఖ్యమంత్రి బయటపెట్టాలి. కేంద్రప్రభుత్వంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ లోఉన్నాయో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హైకోర్ట్ ప్రధానన్యాయమూర్తి సహా, అందరు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ విధంగా ఎవరి ఫోన్లు ట్యాప్ లో ఉన్నాయో బయటపెట్టాలి. ఇతరుల రహస్యాలు వినాలనుకుంటున్న ఈప్రభుత్వం ముమ్మాటికీ నీచమనస్తత్వం కలిగిన ప్రభుత్వం. ఏచట్టంప్రకారం , ఎవరిఆదేశాలతో ఇతరులసంభాషణలు వింటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి.

భారతదేశపౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కుని, స్వేచ్ఛను ఫోన్ ట్యాపింగ్ అనే చర్యతో హరించే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? రాష్ట్రప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై కేంద్రప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలి. ఇతరుల ప్రైవసీలోకి ప్రవేశించే అధికారం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎవరిచ్చారో చెప్పాలి. పరీక్షపత్రాల లీకేజ్ అనేది కేవలం ఈప్రభుత్వానికి వంకమాత్రమే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినతొలిరోజునుంచీ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది నిజంకాదా?

ఫోన్ ట్యాపింగ్ కు నైతికబాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలి. ఏ కారణంతో ట్యాప్ చేస్తున్నారో ఆయన ప్రజలకు సమాధానంచెప్పాలి. నేరపూరితమైన ఫోన్ ట్యాపింగ్ పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీలను డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై స్పందించకుంటే తాము న్యాయపోరాటంద్వారా ఈవ్యవహారం గుట్టుమట్లు తేలుస్తాం.