రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళనానికి ప్రధాని మోదీ హాజరు

– వెయ్యిమంది పీఠాథిపతులు, ముఖ్యమంత్రులు
– మహా పాదయాత్రలో శ్రీశైలం చేరుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ శివాచార్య స్వామి

రేపటి నుండి జనవరి 10వ తేదీ వరకు క్షేత్రంలో పలు రకాల ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని జనవరి 11 నుంచి 15 వరకు భారీ ఎత్తున జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన కార్యక్రమాలలో రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మందికి పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు ,పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ శివాచార్య స్వామి తెలిపారు.

లోక కళ్యాణార్ధం శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి 1008 డాక్టర్ చెన్న సిద్ధరామ శివాచార్య స్వామిజి శ్రీశైలం క్షేత్రానికి మహాపాదయాత్రగా వేల సంవత్సరాల చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఎన్నో గొప్ప సంకల్పాలతో కర్ణాటక యడ్యూర్ నుండి శ్రీశైలం వరకు సుమారు 650 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వందలమంది భక్తులతో ఈ రోజు ఉదయానికి పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకున్నారు.

వందల కిలోమీటర్ల సుదీర్ఘ మహా పాదయాత్రలో క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతికి దేవస్థానం ఆలయ సాంప్రదాయం అనుసరించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి సభ్యులు ఆలయ ఈవో ఎస్.లవన్న తులసిమాలను వేసి స్వామికి ఘనంగా ఆహ్వానం పలికారు. ఆలయంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ శ్రీశైలం యొక్క కీర్తిని దేశవ్యాప్తం చేయాలని దేశ ప్రధాని నరేంద్రమోడీని కూడా శ్రీశైలానికి జనవరిలో వచ్చే అవకాశం ఉందని.. శ్రీశైలానికి రైలు మార్గాన్ని ఏర్పాటుకు క్షేత్ర అభివృద్ధి సహకారాలు అందించాలని కోరతమని పీఠాధిపతి మీడియాతో అన్నారు.
మహా పాదయాత్ర 43 రోజులుగా సాగిస్తూ ఈరోజు శ్రీశైలం చేరుకున్నమన్నారు.