– ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నలుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందుకున్నట్లు సమాచారం. సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావుకు తాజాగా అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చిందని, ఇప్పట్లో ఆయన భారత్ కు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.