-చంద్రబాబు ఇంటిపై దాడి కేసు
-మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు
మంగళగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్ దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.