భారతదేశంలో రాజకీయాలు ఒక అతిపెద్ద పరిశ్రమ

Spread the love

కోట్లమందికి ఉపాధిని, ఆహారాన్ని, ఆదాయాన్ని, టైంపాస్ ని, ఆనందాన్ని ఇవ్వడంతో పాటు అతి పెద్ద తమాషా (Recreation) ను కలిగిస్తున్నది. కొద్దిమంది నైతే ఏకంగా అపరకోటీశ్వరులను చేసేస్తుంది.

నోరున్న ప్రజలకేమో అదొక
రాబిన్ హుడ్ సినిమా,
నోరులేని వారికి అదొక ట్రాజెడీ సినిమా.
దోచుకునే వారికొక కౌబాయ్ మూవీ,
దోచబడేవారికొక హర్రర్ మూవీ…

విలువలు, ఆదర్శాలు బేఖాతర్,
ప్రయోజనాలు, పైరవీలే బేఫికర్…

స్కీములు ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు, బీర్లుతాపుతారు, బిర్యానీ లు పెడతారు, భూములిస్తారు, ప్లాట్లిస్తారు,
poliఇండ్లిస్తారు, ఫ్లాట్లిస్తారు, ఓటుకు నోటిస్తారు, తప్పును రక్షిస్తారు…ఇవన్నీ ఒకెత్తైతే, వీడు వాన్నితిట్టి,వాడువీన్ని తిట్టి అతిపెద్ద తమాషా ఇస్తారు.ప్రజలు కూడా సీరియస్ ఉపాన్యాలకంటే, చర్చలకంటే, తమాషాతో కూడిన తన్నులాటలకే, ఉపన్యాసాలకే, నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత
voter ఇస్తున్నారు.ఎందుకంటే , వారిదగ్గర అన్నీ ఉన్నాయి, కడుపు నిండిన వారికి కావాల్సింది తమాషే.
పైసలిచ్చి మరీ తమాషా అందిస్తుంటే ఎవరొద్దంటారు?అందుకే,జో గాలీదేతే, ఓహీ సికిందర్…
తిట్టే వాడిదే రాజ్యం, తన్నే వాడిదే భోజ్యం.

పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply