జగన్‌ సీఎం అయిన ఆరు రోజులకే పొన్నవోలుకు పదవి

-వైఎస్‌ పేరును చేర్చినందుకే పొన్నవోలుకు పదవి
-ఎవడో తెలియని లాయర్‌కు ఎందుకు మేలు చేశారు?
-ఉండవల్లి కూడా నాతో అదే చెప్పారు
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు

ఏఏజీ పొన్నవోలు వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నలు సంధించారు. విశాఖలో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజులకే పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి పదవి వరించింది. వైఎస్‌ పేరును చార్జిషీట్‌లో పెట్టిం చినందుకే జగన్‌ గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఎవడో తెలియని ఆయనకు ఆరు రోజుల్లోనే అడ్వకేట్‌ జనరల్‌ పదవి అంత హడావిడిగా ఇస్తారా? ఎందుకు మేలు చేశారు? అని ప్రశ్నించారు. పొన్నవోలు అనే లాయర్‌ ఎవరో ప్రపంచానికి కూడా తెలియదు. ఆయన జగన్‌ కోసం పిటిషన్‌లు వేసి చార్జిషీట్‌లో వైఎస్‌ పేరు పెట్టించారు. దానికి ప్రతిఫలంగానే ఆయనకు జగన్‌ పదవి ఇచ్చారని వెల్లడిరచారు. తండ్రి మీద కేసులు పెట్టిన వారికి ఎవరైనా పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. మీరు పదవి ఇచ్చారు అంటే మీరు పొన్నవోలు రుణం తీర్చుకో వాలి అనుకున్నారు కదా అని పేర్కొన్నారు.

ఉండవల్లే నాతో చెప్పారు…

సీబీఐ నిజానికి ఎఫ్‌ఐఆర్‌లో కూడా వైఎస్‌ పేరును చేర్చలేదు. వైఎస్‌ పేరు చార్జిషీట్‌లో లేకపో తే జగన్‌ బయటకు రావడం అసాధ్యం అనుకున్నారు. వైఎస్‌ పేరును చార్జిషీట్‌లో చేర్చాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ కోర్టులో పొన్నవోలు పిటిషన్‌లు వేశాడు. సీబీఐ కోర్టు, హైకోర్టు సుధాకర్‌రెడ్డి పిటిషన్లను కొట్టేసింది. సుప్రీంకోర్టు మాత్రం విచారణ జరగనివ్వండని చెప్పింది. వైఎస్‌ మీద గౌరవం అని పొన్నవోలు చెప్పే మాటలు అబద్ధం. అభిమాన నాయకుడు అయితే కోర్టుల చుట్టూ పేరు చేర్చాలని తిరుగుతారా? జగన్‌ ఆదేశాల మేరకే పిటిషన్లు వేశారు. ఇది నిజమో కాదో ఒకసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ని అడగండి. గతంలోనే ఉండవల్లి వైఎస్‌ పేరును జగన్‌ పెట్టించాడని ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చి పేరు నమోదు చేయించారని ఉండవల్లి నాతో చెప్పాడు. వైఎస్‌ పేరును కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీట్‌లో పెట్టించింది అనేది అవాస్తవం. ఈయన ఏం లాయరో అర్థం కాలేదు. దొంగ ఎవరు అంటే బుజాలు తడుముకున్నట్లు ఉంది. ఏకవచనంతో ఊగిపోతూ జగన్‌ మీద గురుభక్తి చాటుకు న్నాడు. నేను చెప్పింది నిజం అని ఆయనే ఒప్పుకున్నాడు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన మాటలకు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

Leave a Reply