దీక్షాపరుడు అయిన రాజు ఉన్న దేశం సుభిక్షంగా,సురక్షితంగా ఉంటుంది!
కానీ దీక్షాపరుడుగా ఉండాలి అంటే చాలా వాటిని త్యజించాలి. మద్యము, మాంసము, కాంతా కనకముల యందు ఆసక్తి కానీ అనురక్తి కానీ ఉండకూడదు. కానీ ఇవన్నీ క్షత్రియ ధర్మానికి విరుద్ధం! కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది పైగా ఇది కలి కాలం. ఇప్పుడు రాజు కత్తిపట్టి దేశాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. తాను నడిపించాలి.
మన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాప్తం ఉంది. అయోధ్య లోని శ్రీరామ మందిరం, కేదారనాథ శివ మందిరం, ఆది శంకరాచార్య విగ్రహ స్థాపన, కాశీ విశ్వేస్వరుని ప్రాంగణం నిన్నటి రోజున శ్రీ భగవద్ రామానుజాచార్యుల విగ్రహ ప్రారంభము ఇలా అన్నిటికి భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ కార్యక్రమాన్ని ముగించారు.
మరీ ముఖ్యంగా దక్షిణాది సాంప్రదాయం అయిన పట్టు వస్త్ర ధారణతో నుదుట నామములతో శ్రద్ధగా పూర్ణాహుతి దగ్గర కూర్చొని ఋత్వికుల ఆశీర్వచనము తీసుకోవడము, ఆపై 40 నిముషాల పాటు ఆ ప్రాంతం అంతా తిరిగి విశేషాలు తెలుసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తీ శ్రద్ధలతో పూర్తీ చేయడమే మన స్వంతంత్ర భారతావనిలో ఒకే ఒక్క ప్రధాని కి దక్కిన అపూర్వమయిన అవకాశం. ఎక్కడా అలసట కానీ, అసహనం కానీ లేదు. ఉన్నది భక్తీ , శ్రద్ధ మాత్రమే. నరేంద్ర మోదీజీ అప్రమేయుడు! దీక్షాపరుడు!
ప్రధాని కార్యక్రమం అంటే అలా రిబ్బన్ కత్తిరించి వెళ్లడమో లేదా తాడు పట్టుకొని తెర తీసి వెళ్ళిపోవడమే చూసాము కానీ ఇలా నరేంద్ర మోదీజీ లాగా వేరే ప్రధానిని మనం చూడలేదు ఇక చూడబోము కూడా!
ఇక గవర్నర్ తమిళ్ శెల్వి ఆసాంతం ప్రధానితో పాటే పద్దతిగా ఉండడం ముదావహం! కానీ అంతసేపు నిలబడి ఉండడం కొందరికి సాధ్యం కాదు! అఫ్కోర్స్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అనుకోండి దానికి మనమేం చేయలేము. ప్రాప్తం లేదు అంతే! ఉదాహరణకి చెప్పాలంటే సత్యన్నారాయణ వ్రతం చూసినా, విన్నా చివరికి తీర్ధ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతే ఎలాంటి దోషం ఉంటుందో మనకి తెలిసిందే!
పూర్ణాహుతి తరువాత ఋత్త్వికుల ఆశీర్వచనానికి విశేషమయిన శక్తి ఉంటుంది! ఆ శక్తిని స్వీకరించే ఆసక్తి లేని వారికి కూడా ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుందాము!
జై శ్రీమన్నారాయణ 🙏🙏
పద్మావతి చిట్టా అఖిల భారత హిందూ మహాసభ మహిళా అధ్యక్షురాలు 🙏🚩