Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ లో రేప్‌ల రాజ్యం : మాజీ స్పీకర్ ప్రతిభా భారతి

రాష్ట్రంలో ప్రతీ రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మాజీ స్పీకర్ ప్రతిభా భారతి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉదయం ఒకరేప్, మధ్యాహ్నం ఒక రేప్, సాయంత్రం ఒక రేప్ ఇలా రేప్‌ల రాజ్యంగా రాష్ట్రం మారిందన్నారు. సీఎం జగన్ ఇంటి పక్కనే మహిళపై అఘాయిత్యం జరిగితే పట్టించుకునే నాధుడు లేడని మండిపడ్డారు. రాష్ట్రంలో కీచకులు, కిరాతకులు అధికమయ్యారని, వారికి భయమనేది లేదన్నారు.

మహిళలను వేధించే ప్రభుత్వమిది అంటూ విమర్శించారు. పోలీసుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు మహిళా అఘాయిత్య కేసులు నమోదయ్యాయని మాజీ స్పీకర్ తెలిపారు. అధికార పార్టీ అండదండలతోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతున్నారని అన్నారు. ఆడబిడ్డల మానప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ వదలరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోమ్ మంత్రికి పరిపాలనలో అనుభవ రాహిత్యముందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాక్షస రాజ్యం నడుస్తోందని తెలిపారు. మహిళా సాధికారత అనే నినాదంతో నారా చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రతిభా భారతి చెప్పుకొచ్చారు.

LEAVE A RESPONSE