-ధరలను అదుపు చేయడంలో మేడీ` జగన్ విఫలం
-ఆంద్రప్రదేశ్‌ను ఆదాని ప్రదేశ్‌గా మారుస్తున్న జగన్
-రైతులను పట్టించుకునే నాధుడే లేడు…… కె రామకృష్ణ
15న అమరావతిలో 10 వామపక్షపార్టీల సమావేశం నిర్వహిస్తున్నామని ,ధరలను అదుపుచేయడంలో మోడీ `జగన్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని దీనిపై చర్చించి భవిష్యత్‌కార్యచరణ ప్రకటిస్తామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. శుక్రవారం సీఆర్ భవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్‌తో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రైతులను పలకరించే నాధుడే లేడన్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అనంతపురం పట్టణానికి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో విద్యుత్‌స్తంబాలు పడిపోయి నాలుగురోజులుగా విద్యుత్ సరఫరా నిలిపోతే అధికారులు కానీ, అక్కడి ప్రజాప్రతినిధికూడా పట్టంచుకోక పోవడంతో అక్కడి రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గత నవంబరులో అధిక వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 69 మంది మృతి చెందినా ఎటువంటి నష్టపరిహారం అందించలేదన్నారు.
సీఎం సమస్యలపై దృష్టిసారించాలని సూచించారు. క్యాబినెట్ సమావేశంలో ఇన్‌పుట్ సబ్సిడీ గురించి మాట్లడలేదన్నారు. ఈవిషయంపై ముఖ్యమంత్రికి లేఖరాస్తానన్నారు. గ్రామాల్లో రైతులు వలసబాట పట్టారన్నారు. నిత్యావసర వస్తూవుల ధరలు, గ్యాస్ ధరలు పెరగడంలో గడప, గడపకు వైసీపీ కార్యాక్రమంలో ప్రజాప్రతి నిధులను మహిళలు నిలదీస్తున్నారన్నారు.పెట్రోల్ ధరలు పక్కరాష్ట్రాల కన్నా మనరాష్ట్రంలో 10రూ అధనంగా ఉందని రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.ఆర్టీసీ 720 కోట్లు, విద్యుత్‌పై 1400 కోట్లు ప్రజలపై బారం మోపారన్నారు. విద్యుత్ బహిరంగ మార్కెట్‌లో రూ 1.99 పై ఉంటే ఆదాని వద్ద రూ 2.49 పై కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఆదాని కుటుంబానికి కృష్ణపట్నం పోర్టు, విద్యుత్‌కాంట్రాక్టు, రాష్ట్రం నుండి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్నారు.రాబోయో రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఆదాని ప్రదేశ్‌గా మారుస్తారన్నారు.ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై 26 జిల్లాల్లో సీపీఐ పెద్దఎత్తున ఆందోళన చేస్తుందన్నారు. ఈనెల 9న చలో సచివాలయం కార్యక్రమం పోలీసులు అనుమతి ఇచ్చినా నాయకులను ఎక్కడి వారిని అరెస్టుచేయడం, గృహనిర్భందం చేయడం , నోటీసులు జారీ చేయడంలో రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేస్ట్ ట్యాక్స్ వేస్తున్న వేస్ట్ ప్రభుత్వమని విమర్శించారు. పేపర్‌లీక్ పై కొందరిని అరెస్టుచేసినట్లు ప్రభుత్వం చెపుతున్నా, మంత్రి పేపర్‌లీక్ కాలేదనడం ఏమిటన్నారు. చిత్తశుద్ది ఉంటే కార్పోరేట్ కళాశాలలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పేపర్‌లీక్ అయిందని నారాయణను అరెస్టుచేసి ప్రభుత్వం అబాసుపాలైదన్నారు.జగన్ మోహన్‌రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈనెల 10న అమరావతిలో 10 వామపక్షపార్టీలతో చర్చించి భవిష్యత్ కార్చచరణ ప్రకటిస్తామన్నారు.26 జిల్లాలో సీపీఐ కొత్త కమిటీలు వేస్తుందని ఇప్పటి కే 24 జిల్లాలో నూతన కమిటీలు వేయడం జరిగి ందన్నారు. 26 జిల్లాలో సీపీఐ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.