Suryaa.co.in

Andhra Pradesh

నారాయణ బెయిల్ రద్దుకు నో

– అవసరం అనుకుంటే నోటీసులు ఇచ్చి విచారించండి
– మాజీ మంత్రి నారాయణ కేసు విచారణ 24కు వాయిదా…

మాజీ మంత్రి నారాయణకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్రెడ్డి పిటిషన్ వేశారు. మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిలు చట్ట విరుద్ధమని సుధాకర్రెడ్డి అన్నారు. నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వుల రద్దుకు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు.

ఈ కేసులో 435, 437, సెక్షన్ 18 పీఆర్సీ కింద సొంత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిలు ఇవ్వడం న్యాయబద్దంగా లేదన్నారు. కనీసం రిమాండ్ సైతం చేయలేదని చెప్పారు. కుట్ర పన్నడానికి ఛైర్మన్ పదవి అవసరం లేదన్నారు. ఈ కేసులో ముద్దాయిలు ఇచ్చిన పత్రంలో నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందని అన్నారు.

అయితే,వెంటనే బెయిల్ రద్దు చేయాలనే విజ్ఙప్తిని తిరస్కరిస్తూ…. ఈనెల 24వ తేదీన ప్రభుత్వ పిటిషన్ పై విచారణ చేస్తామని పేర్కొంది. ఈలోగా అవసరం అనుకుంటే… నారాయణకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం లో ఈ నెల 10న నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేయగా, చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. దీన్ని ప్రభుత్వం జిల్లా కోర్టులో సవాలు చేసింది.

LEAVE A RESPONSE