Suryaa.co.in

Telangana

ప్రేమదేశం రిపీట్‌

– విషాదంగా క్లైమాక్స్‌

నగరంలోని శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మంచి స్నేహితులు. కానీ ఇద్దరూ ఒకే అమ్మాయి ప్రేమించడంతో తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడికి దక్కుతుందేమో అని అనుమానంతో సొంత స్నేహితుడినే కొట్టి చంపేశాడు ఓ కిరాతకుడు. అచ్చం ప్రేమదేశం సినిమాను తలపించేలా ఈఘటన జరిగింది. కానీ క్లైమాక్స్‌ మాత్రం చాలా దారుణంగా ముగిసింది. ఈఘటన నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది.

నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు నెనావత్ నవీన్ అనే యువకుడు చెందినవాడు. నెనావత్‌ నల్గొండలోని ఎంజి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ త్రిబుల్ ఈ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నాడు. అయితే.. అదే కాలేజీలో చదువుతున్న హరికృష్ణతో ఇతనికి మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులే కానీ.. వీరిద్దరి మధ్యలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయినే ఇద్దరూ ప్రేమించారు. అమ్మాయి ప్రేమ కారణంగా వీరిద్దరి స్నేహం దెబ్బతినడమే కాకుండా.. ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి.

అయితే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దక్కదనే భయం హరికృష్ణలో మొదలైంది. దీంతో ప్రాణానికి ప్రాణంగా ఉన్న నవీన్‌ను చంపేదుకు ప్లాన్‌ వేశాడు. అతని స్నేహితులతో హరికృష్ణ టచ్‌ లో వున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీన ఉదయం పార్టీ గెట్‌ టుగెదర్‌ చేసుకుందామని హరికృష్ణ.. తన స్నేహితుడి రూమ్ కి నెనావత్ నవీన్ ను రావాలని ఆహ్వానించాడు.

అయితే.. స్నేహితుడి రూమ్ హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. తన ప్రాణ స్నేహితుడే కదా అని నవీన్‌, హరికృష్ణను నమ్మాడు. పాపం నవీన్‌ ఆరోజే తన చివరి రోజు అవుతుందని ఊహించలేక పోయాడు. కోరిక మేరకు నవీన్ అక్కడికి చేరుకున్నాడు. అయితే.. అక్కడ పార్టీలో మరోసారి నవీన్, హరి ఇద్దరికీ గొడవ జరిగింది.

ఈ విషయాన్ని నవీన్ వెంటనే తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో భయాందోళన చెందిన హరి అది ఎక్కడికి దారితీస్తుందో అని భయపడిన శంకరయ్య.. హరితో ఫోన్లో మాట్లాడి రాజీ కుదిరించడంతో.. ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి నాలుగు రోజులైనా కూడా నవీన్ కాలేజీకి కానీ, ఇంటికి కానీ రాలేదు. కాగా.. కంగారుపడ్డ నవీన్‌ తండ్రి శంకరయ్య నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. అయితే.. శంకరయ్య ఫిర్యాదు మేరకు సీఐ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నార్కట్పల్లి ఎస్సై రామకృష్ణ కేసును దర్యాప్తులో భాగంగా హరి స్నేహితులను, ఎంజీయూలోని విద్యార్థులను ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈనెల 22 సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, హరిక్రిష్ణ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి అడిగారు. అయితే.. అప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న హరి స్నేహితులు, కుటుంబసభ్యులు, పోలీసుల నుంచి తన మీద ఒత్తిడి పెరుగుతుందని గ్రహించి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో నిన్న శుక్రవారం హరి కృష్ణ లొంగిపోయాడు. మృతుడు నవీన్ తాను ప్రేమించిన అమ్మాయిని ఎక్కడ దక్కించుకుంటాడోనని, తనకు ఆమె ఎక్కడ దూరం అవుతుందోనని, అసూయతోనే నవీన్‌ని విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని హరికృష్ణ తెలిపాడు.

అనంతరం నవీన్ మృతదేహాన్ని అబ్దుల్లాపూర్మెట్ శివారులోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మీద పడేసిన హరికృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హరికృష్ణ ఇచ్చిన సమాచారంతో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హరికృష్ణ మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A RESPONSE