– ఉప రాష్ట్రపతిగా నబ్బాస్ నక్వీ?
– బీజేపీ కసరత్తు
( శ్రీరాంప్రసాద్ మొవ్వా)
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో బీజేపీ హైకమాండ్ అన్ని రకాల ఫార్ములాలపైన కసరత్తు చేస్తోంది. ఈసారి రాష్ట్రపతిగా మహిళ అభ్యర్థిని బరిలో నిలపాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అలాగే ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. మోదీ, షా ద్వయం దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఉప రాష్ట్రపతి రేసులో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ముందున్నారు. గల్ఫ్ దేశాల్లో ఇటీవలి ఆందోళనల ప్రభావమే మైనార్టీ నేత ఎంపికకు కారణంగా తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తపై కామెంట్ల వివాదం నుంచి బయటపడేందుకు ముస్లిం వర్గం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఒకవేళ నక్వీ కాకుంటే ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరు పరిశీలిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
అలాగే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో గిరిజన మహిళ లేదా OBC నేతకు అవకాశం దక్కొచ్చంటున్నారు. దేశంలో 9 శాతంగా ఉన్న గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవాలని భావిస్తే ఎస్టీ సామాజిక వర్గం నుంచే అభ్యర్థి ఉంటారు. లేదంటే OBC నేతకు అవకాశం ఇస్తారు. ఈ విషయంలో ఐదారు పేర్లు తెరపైకి వచ్చాయి.