మహబూబ్‌నగర్: తెలంగాణలో నేడు ప్రదానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఆదివారం నాడు మహబూబ్‌నగర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారు. బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ… ‘‘పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేశాం. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి.
కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్ పార్క్స్, 4 ఫిషింగ్ క్టస్టర్స్ నిర్మిస్తాం. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, 900 కోట్లతో సమక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ, ఇన్స్‌స్టిట్యూట్ ఆప్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ స్థాయిని పెంచడం’’ లాంటి ప్రధాన హామీలను మోదీ ప్రకటించారు.