Suryaa.co.in

Sports

భారత్ కు గర్వకారణం ప్రవీణ్ కుమార్ : ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కృషి, పట్టుదలతో ప్రవీణ్ కుమార్ ఈ పతకం సాధించారని మోడీ శుక్రవారం ట్వీట్ చేశారు. భారత్ కే ప్రవీణ్ కుమార్ గర్వకారణంగా నిలిచారని మోడీ పేర్కొన్నారు. ‘పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించినందుకు తాను గర్వపడుతున్నానని, ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రవీణ్ కుమార్ మరిన్ని పతకాలు సాధించాలని మోడీ ఆకాంక్షించారు. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌ పురుషుల హైజంప్‌ విభాగంలో భారత హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జోనాథన్‌ ఎడ్‌వర్డ్స్‌ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. ప్రవీణ్‌ మాత్రం అతడిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్‌ బంగారు పతకం సాధించారు. ప్రవీణ్‌ కుమార్‌ (2.07 మీ.)కు మాత్రం రజత పతకం వచ్చింది. ప్రవీణ్‌ కుమార్‌ సాధించిన రజతపతకంతో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 11కు చెరింది. ఇందులో రెండు బంగారు (అవని లెఖారా, సుమిత్‌), ఆరు సిల్వర్ (ప్రవీణ్‌ కుమార్‌, మరియప్ప తంగవేల్‌, దేవేంద్ర ఝజారియా, యోగేష్‌ కథునియా, నిషద్‌ కుమార్‌, భవీనాబెన్‌ పటేల్‌) ‌, మూడు వెండి (శరద్‌ కుమార్‌, సిఘ్రాజ్‌ అధనా, సుందర్‌ సింగ్‌ గుర్జర్‌) పతకాలు ఉన్నాయి.

LEAVE A RESPONSE