– వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ: ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పశ్చిమ నియోజకవర్గంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు. భవానిపురం 40వ డివిజన్ లారీ స్టాండ్ ప్రాంతంలో 15 వ ఆర్థిక సంఘం నిధులతో రూ 3 కోట్ల 30 లక్షల తో నూతనంగా నిర్మించిన మంచినీటి ట్యాంకును బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో గుర్తిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. 1 లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు ద్వారా గాంధీ బొమ్మ రోడ్డు, కోళ్ల ఫారం రోడ్డు, చర్చి రోడ్డు, ఆకుల రాజేశ్వరరావు రోడ్డు, ఆర్టీసీ వర్క్ షాప్, టెలిఫోన్స్ కాలనీలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సుజనా ఫౌండేషన్ ద్వారా పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.
కార్యక్రమంలో కూటమినేతలు నాగుల్ మీరా, బొమ్మసాని సుబ్బారావు, అబ్దుల్ ఖాదర్, మహాదేవు అప్పాజీరావు, హర్షద్, మరుపిళ్ల రాజేష్ , గుడివాడ నరేంద్ర రాఘవ, అత్తులూరి పెదబాబు, బెవర మురళి, పైలా సురేష్ స్థానిక కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయ రెడ్డి, మహమ్మద్ ఇర్ఫాన్ ఈ ఈ వెంకటేశ్వర రెడ్డి, డి ఈ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.