Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ… వెనుకబడ్డ ముస్లింల ఆర్థిక పరిఫుష్టి

రాష్ట్రంలో ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను అధికార దుర్వినియోగంతో కొల్లగొడుతున్నారు. దర్గాలు, మసీదులకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్ల రూపాయల విలువైనpavan1 ఆ ఆస్తులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వక్ఫ్ ఆస్తులను ముస్లిం వర్గాలు… ముఖ్యంగా పేద ముస్లిం యువతను అభివృద్ధి వైపు నడిపించేందుకు సద్వినియోగపరచాలి.

ముస్లింలకు పదవులు, కార్పొరేషన్లను పాలకపక్షం ఓటు బ్యాంకు రాజకీయ అవసరాల కోసం వాడుకొంటోంది. వక్ఫ్ ఆస్తులను కబ్జా చేయడం ద్వారా సంబంధిత కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తున్నారు. ముస్లిం వర్గాలను ఆర్థికంగా పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది. వారికి మెరుగైన విద్యా వసతులుpavan2 కల్పించాలి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. తద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక సాధికారత లభిస్తుంది. దూదేకుల ముస్లిం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. ముస్లింలు, వారిలోని నూర్ బాషాలు, లధాఫ్ లాంటి అన్ని వర్గాల అభివృద్ధి, రాజకీయ, ఆర్థిక సాధికారతను సాధించడాన్ని జనసేన పార్టీ ప్రాధాన్యాంశాల్లో ఒకటిగా తీసుకుంది.

LEAVE A RESPONSE