అవినీతి సీఎంలను మోదీ ప్రోత్సహించకూడదు

– మైదుకూరులో టీడీపీ-వైసీపీ నేతలు కలసి వ్యాపారం చేసుకుంటున్నారు
– ఎమ్మెల్యే రఘునాధరెడ్డికి మండలానికి ఇద్దరు బ్రోకర్లు
– టీడీపీ అక్కడ పెద్దగా పనిచేయడం లేదు
– వాస్తవాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళతా
– మాజీ మంత్రి డీఎల్‌ సంచలన వ్యాఖ్యలు

నిజాయితీపరుడైన ప్రధానిగా పేరున్న నరేంద్ర మోడీ, అవినీతిపరులైన సీఎంలు, నాయకులను చేరదీయకూడదని, వారిని ప్రోత్సహిస్తే ప్రధానికే చెడ్డపేరు వస్తుందని మాజీ మంత్రి డీఎస్‌ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ నేతలు కలసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

డీఎల్‌ ఇంకా ఏమన్నారంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి పరులను దగ్గరకు తీసుకోకూడదు.నరేంద్ర మోడీ అవినీతిని అంతం అందించాలంటే, అవినీతికి పాల్పడిన సిఎంలను, మంత్రులను దగ్గరకు రానివ్వకుడదు.అవినీతి పరులను రక్షించే ప్రయత్నం చేయకూడదు.మైదుకూరులో వైసిపి, టీడిపి నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి, ప్రభుత్వ భూములు వెంచర్లు వేసి.. ఎమ్మేల్యే రఘు రామిరెడ్డికి కొంత భాగం ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారు. మైదుకూరు లో తెలుగుదేశం పార్టీ నామాత్రంగానే పనిచేస్తుంది. వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలకు, అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తా. మైదుకూరు నియజకవర్గంలోని మండలానికి ఇద్దరు బ్రోకర్ల ద్వారా, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అదాయం సమకూర్చుకుంటున్నారు. భూకబ్జాలు, ఖనిజ సంపద ఏది వదలకుండా ఎమ్మెల్యే కోట్లు సంపాదిస్తున్నాడు.

Leave a Reply