– కృష్ణాజలాలతో అనంతపురం జిల్లా సస్యశ్యామలం
– రైతుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
– సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం
– మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి
ఉరవకొండ: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, సీఎం వైయస్ జగన్ అందిస్తున్న మంచి పరిపాలనకు ప్రకృతి, దేవుళ్ళు కూడా సహకరిస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, వైయస్ఆర్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలం అంకంపల్లి వద్ద హంద్రీనీవా 10 లిఫ్ట్ నుండి శీర్పి ,బెలుగుప్ప చెరువులకు నీరు విడుదల చేసే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి పంప్ హౌస్ నుండి హంద్రీనీవా నీటిని వారు విడుదల చేశారు.అనంతరం కెనాల్ వద్ద గంగ పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు బాగుండాలని, రైతు బాగుపడాలని సీఎం వైయస్ జగన్ అనుక్షణం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. హంద్రీనీవా నీటిని ఒక ప్రణాళిక ప్రకారం రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే అనేక చెరువులు నీరు విడుదల చేశామని మిగతా అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామన్నారు.కృష్ణాజలాలతో జిల్లా సస్యశ్యామలం అవుతోందని తెలిపారు.హంద్రీనీవా ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకూ కృష్ణాజలాలు తీసుకొచ్చి ప్రతి ఎకరాకూ సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో జెడ్పిటిసి మమత, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న,అంకంపల్లి సర్పంచ్ రుద్రానంద, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, శివలింగప్ప, మచ్చన్న, సర్పచులు రమేష్, రామిరెడ్డి, కేశవ రెడ్డి, రోజా, వైస్ ఎంపీపీ పుష్పావతి, ఎంపిటిసిలు ప్రసాద్,శంకర్ రెడ్డి, నాయకులు ధనుంజయ నాయక్ ,నాగిరెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.