– దసాల్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: ఫ్రెంచి సాఫ్ట్ వేర్ సంస్థ దసాల్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జెలాన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఏఐ, డీప్ టెక్ రంగాల అభివృద్ధికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఏపీలోని విశాఖపట్నం/తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటు చేయండి.
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద టాలెంట్ పదూల్ ఉన్నందున ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో భాగస్వామ్యం వహించండి. సీఏడీ, పీఎల్‌ఎం, 3డి మోడలింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించండి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణా పాఠ్యాంశాలను రూపొందించడానికి డస్సాల్ట్ సిస్టమ్స్ పరిశ్రమ నిపుణులతో కలిసి సహకారం అందించండి.
ప్రపంచ నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అమరావతి డెవలప్ మెంట్ ప్లాన్ల రూపకల్పనలో దసాల్డ్ సిస్టమ్స్ నైపుణ్య సహకారాన్ని అందించాలని కోరారు. దసాల్డ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జెలాన్ మాట్లాడుతూ… గత ఏడాది జూన్ లో భారత్ లో దసాల్డ్ సిస్టమ్స్ కార్యకలాపాలు ప్రారంభించాం. 2027నాటికి 1 బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయాన్ని భారత్ లో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.