– బాబు అరెస్ట్‌పై.. టీడీపీ సీనియర్లే నోరుమెదపడం లేదు
– అందుకే ఇతర రాష్ట్రాల నేతలను మద్దతు కోసం బతిమిలాడుకుంటున్నారు
స్పెషల్ ఫ్లైట్లు పెడతాం.. వచ్చి సంఘీభావం తెలపండని వేడుకుంటున్నారు
– ప్రజాభిమానం, చరిష్మా, నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తి బాబు
– ప్రజా బలం ఉంటే స్టేలు తెచ్చుకోకుండా విచారణను ఎదుర్కోవాలి
– బాబు నీతిమంతుడు అని భావిస్తే… ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ కోరాలి
– కేసు లన్నిటిలో శిక్ష పడితే చంద్రబాబు జీవితాంతం బయటకు రాడు
– వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
పురందేశ్వరి బీజేపీలో టీడీపీ కోవర్టు అని నేను భావిస్తున్నా. ఆమెతో పాటు బీజేపీలో చాలా మంది టీడీపీ కోవర్టులున్నారు. బీజేపీ ఆధికారంలో ఉంది కాబట్టి వీరంతా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి జనసేన బీజేపీతో ఉంది..భవిష్యత్తులో టీడీపీతో కలిసే అవకాశం ఉందని ప్రజల్లో ప్రచారం ఉంది. కాబట్టి సాధారణంగానే జనసేన అనేది టీడీపీకి సపోర్ట్ చేస్తుంది.
గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. నిన్న టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది…చివరికి హెరిటేజ్ సంస్థలు కూడా మూయలేదు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ సందర్భంగా ఆయన సచ్చీలుడు, మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడని నమ్మించే ప్రయత్నం ఒక మీడియా వర్గం ప్రయత్నం చేస్తోంది. దాంట్లో వాళ్లు పూర్తిగా వైఫల్యం చెందారు.
చంద్రబాబు స్వతహాగా నేర స్వభావం, నేర ప్రవృతి కలిగిన వ్యక్తి. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన నీచరాజకీయాలు, అకృత్యాలు ఆయన స్వభావాన్ని తెలుపుతాయి. నేర స్వభావాన్ని, ఆలోచనలను వెనకేసుకు వచ్చే క్రమంలో ఆయన వర్గ మీడియా ఆయన సౌమ్యుడు, ఉదారస్వభావం ఉన్న విజనరీ అనే మెసేజ్ పంపాలని ప్రయత్నం చేశారు. దానిలో వాళ్లు విఫలమయ్యారు…అది నిజం కాదు అన్నది ప్రజలు కూడా గమనించారు.
డబ్బుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు. సీమెన్స్ అనే సంస్థ ఒక మల్టీ నేషనల్ కంపెనీ. ఆ కంపెనీ 90 శాతం ఇస్తుందో లేదో కూడా తెలియకుండా ప్రభుత్వ వాటాగా 10శాతాన్ని విడుదల చేశారు. రూ.370 కోట్లు విడుదల చేసి తన బినామీ ఎకౌంట్లో వేసుకున్న తీరు సీఐడీ కోర్టు ముందు పెట్టింది.
ఈ విషయంలో లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్ అనే వ్యక్తి కీలక భాగస్వామి.యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించినప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారు. రాజకీయాలు బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు. కాదని ఎవరైనా అంటే ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. రాజకీయాలను సామాన్యులకు దూరం చేస్తూ చంద్రబాబు ఓటుకు నోటు కేసు అందరూ చూశారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు.
స్వతహాగా చంద్రబాబుకి ఎటువంటి చరిష్మా లేదు. 1983 ప్రాంతంలో ఎన్టీఆర్‌తో చంద్రబాబు ఫోటోలు మీరు చూస్తే అది అర్ధం అవుతోంది. ప్రజాభిమానం లేదు..చరిష్మా లేదు…నాయకత్వ లక్షణాలు కూడా లేవు. డబ్బుతో రాజకీయాలను ముడిపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు.
ఏలేరు రిజర్వాయర్ నుంచి పోలవరం భూసేకరణ, ఐఎంజీ భారత్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం..ఇలా ప్రతిదీ ఒక స్కామే. అమరావతి నిర్మాణం, పోలవరం, పేదల హౌసింగ్..ఇలా ప్రతి పని వెనుక ఒక స్కామ్ ఉంది. స్కిల్ కుంభకోణంలో సీమెన్స్ చెప్పిన విషయాన్ని ఒక సారి గమనించాలి.
రూ.3వేల కోట్లలో రూ.2,700 కోట్లు ఇస్తామని మేం ఎవరికి చెప్పామని సీమెన్స్ ప్రతినిధి తన స్టేట్‌మెంట్‌లో ప్రశ్నించాడు. మా కంపెనీ 90 శాతం ఇస్తుందని, పది శాతం మీరు ఇవ్వండి అని ఎందుకు చెప్తాం అని ఆ కంపెనీ ప్రశ్నించింది. దీన్ని బట్టి చంద్రబాబు ఎలా రూ.370 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ డబ్బు సీమెన్స్‌కి వెళ్లిందని టీడీపీ వారు చెప్తుంటే…అది మాకు రాలేదు అని సీమెన్స్ చెప్తోంది.
ఇక్కడెవరూ నోరు విప్పడం లేదని ఇతర రాష్ట్రాల వారిని బతిమిలాడుకుంటున్నారు. బాబు అరెస్ట్ తర్వాత నోరువిప్పడానికి టీడీపీ సీనియర్ నాయకులే ముందుకు రావడం లేదు. అందుకే ఆయన ప్రతినిధులను ఇతర రాష్ట్రాలకు పంపారు. చంద్రబాబు చేసిన అనేక నేరాల్లో ప్రధాన భాగస్వామిగా రామోజీ పాత్రను కూడా విచారణ చేయాలి. రామోజీనే ఒక మోసం..ఒక దగా..తనకు అవకాశం ఇచ్చి సహకరించిన ప్రతి ఒక్కరినీ తొక్కేస్తూ తన అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడు.
ఎన్ని ఊహలైనా వారు చేసుకోవచ్చు..ఊహాజనితంగా ఆరునెలల్లో అధికారంలోకి వస్తానని కలలు కనొచ్చు. వాళ్లు రారు…రాలేరు..ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జగన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు..ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్సార్సీపీ.