నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని…..

-రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సగానికిపైగా ఉద్యోగుల జీతాలకే పోతోంది.
– ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి పెరిగింది.
– తిన్నది అరగక, పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలిస్తున్నా పనిలేని సమ్మెకు దిగుతారట. ప్రజలే వారి సంగతి ఆలోచించాలి.
ఇవీ.. గత పక్షం రోజుల నుంచి మంత్రులు, సలహాదారులు, వైసీపీ సోషల్‌మీడియాలో ఉద్యోగులపై వెల్లువెత్తుతున్న విమర్శనాస్త్రాలు. కాసేపు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతోంది? ఏ వ్యవస్థ ఎలా అఘోరిస్తుంది? అందులో పాత్రధారులైన మంత్రులు, ఐఏఎస్-ఐపిఎస్ అధికారులు పోషిస్తున్న నైతిక
vja-emp4 పాత్ర ఎంత? ఎవరెంత అవినీతిపరులు? ఎక్కడ ఏ రంగంలో అవినీతి వర్థిల్లుతోంది అన్న అంశంపై నాకున్న సందేహాలు మీతో పంచుకుంటా. ఒకరకంగా ఇవే మా ప్రభుత్వోద్యోగుల పక్షాన నేను సంధించే ప్రశ్నాస్త్రాలు. వీటికి జవాబు చెప్పే దమ్ము, ధైర్యం పాలకపార్టీలకు, వారి కోసం పనిచేసే పేటీఎం బ్యాచ్,

రాజకీయపార్టీలకు ఉందా? చదవండి మరి.

1.ఎమ్మెల్యే అవ్వగానే వందల, వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అని అడుగు?
2.ఎమ్మెల్యేల పిల్లలను ప్రభుత్వ స్కూల్ లో ఎందుకు చేర్పించడమ్ లేదో అడుగు?
3. ఏ శాఖకు చెందిన మంత్రి ఆ శాఖలో గల స్కూల్, హాస్పిటల్, బస్సు ,రోడ్డు గల వాటిలో ఎందుకు ఉండటం లేదో అడుగు?
4.మద్యం మానిపించడానికి పెట్టిన సలహదారుని వల్ల ఎంతమంది మానారో అడుగు?
5.ఎంత మంది ఎమ్మెల్యే, మంత్రులు మద్యం మానుకున్నారో అడుగు?
6.ఒక ఉద్యోగి 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే పెన్షన్ లేదు. అదే ఒక ఎమ్మెల్యే ఒక్క రోజు ఎమ్మెల్యే అయినా జీవితాంతం లక్షల పెన్షన్ ఎందుకో అడుగు?
7.రాజకీయ నాయకులు సేవ చేయడానికి వచ్చినప్పుడు లక్షల శాలరీ ఎందుకు? న్యూస్ పేపర్ కి 5000, ఎలవన్స్ ఎందుకు? ఇంటి అద్దె కి 80000 ఎందుకో అడుగు?ఫోన్ బిల్ 8000 ఎందుకో అడుగు?
8.ఎమ్మెల్యేలు, ఎంపీ లు అసెంబ్లీ,పార్లమెంట్ లో ఒక రూపాయికి ఫిల్టర్ కాఫీ , 5రూపాయలకి ఫైవ్ స్టార్ టిఫిన్ ఎందుకో అడుగు?
9.రాజకీయ నాయకులకు లేదా వాళ్ళ చుట్టాలకు ఎందుకు ప్రాజెక్ట్స్, కాంట్రాక్ట్స్ వెళ్తున్నయోనని.
10. అవినీతి జరిగినప్పుడు రాజకీయ నాయకులను చట్టం ఏం చేయడం లేదు ఎందుకు అని అడుగు?
11.1935 లో లార్డ్ మెకాలె రాసిన పోలీస్ మాన్యువల్ ని ఇంతవరకూ మార్చలేదు ఎందుకో అడుగు?
12.ఉద్యోగులను రాజకీయ నాయకులు మేము చెప్పిన పని మాత్రమే చేయాలి లేకపోతే బూతులు , దెబ్బలు, పోస్టింగ్ లు మార్చడం ఎందుకు చేస్తున్నారో అడుగు.
13.ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు, గెలిచిన తరువాత ఎందుకు నెర వేర్చలేదో అడుగు?
14.ఒక స్కూల్ లో పిల్లోడు తప్పుచేస్తే సస్పెండ్ చేయొచ్చు లేదా TC ఇచ్చి పంపొచ్చు, ఒక ఉద్యోగి తప్పుచేస్తే సస్పెండ్ చేయొచ్చు , ఉద్యోగం నుంచి తీసేయవచ్చు కానీ ఒక ఎమ్మెల్యే, ఎంపీలు ఎన్ని అక్రమాలు, ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎన్ని తప్పులు చేసినా ఆ పదవిని ప్రజలకు తీసేసే అధికారం ఎందుకు ఇవ్వలేదో అడుగు?
15.ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కనీసం 5సంవత్సరాలు ఆర్మీ లో ఉద్యోగం చేయాలి అని అడుగు.
16.దేశ భవిష్యత్తు నిర్మించే ఓటు వేయడానికి 18 సంవత్సరాలు. అదే పెళ్ళి చెసుకోవడానికి 21 సంవత్సరాలు ఎందుకో అడుగు?
17.రాజకీయ నాయకుల అండ దండలతో లక్షల కోట్లు ఎగ్గొట్టి బ్యాంక్స్ కి నామం పెట్టిన వారికి రుణ మాఫీ ఎందుకో అడుగు?
18.పది వేలు ఇవ్వాలి అంటే సామాన్య మానవుడిని వంద సార్లు తిప్పే బ్యాంక్.. వందల,వేల కోట్లు కార్పొరేట్ కంపెనీ లకు ఎలా ఇస్తున్నాయో అడుగు?
19.అయిదు వందలు దొంగతనాలు చేస్తే అరెస్ట్ చేసే పోలీసు లు.. వందల,వేల కోట్లు దోచుకున్న రాజకీయ నాయకులను, కార్పొరేట్ కంపెనీ వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో అడుగు?
20.మన దేశంలో వున్న జనాభా కంటే.. కోర్టులలో వుండే పెండింగ్ కేసులు ఎక్కువ ఎందుకో అడుగు?
పై వాటిని మిమ్మల్నిమీరు ప్రశ్నించుకుని అప్పుడు ఉద్యోగులను అడుగు సోదరా…!

– సామాజిక బాధ్యతతో ఓ ప్రభుత్వ ఉద్యోగి
(షేక్ సుబ్బారెడ్డిమాదిగ ఇబ్రహీంచౌదరిరాయల్ గుప్తా రాజు శర్మ)

Leave a Reply