రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Spread the love

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ శుక్రవారం రాత్రి దమ్మపేట మండలం మందలపల్లి లో పోలీసులకు చిక్కాడు. ఆంధ్ర కు పారిపోతుండగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి..విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి కోర్ట్ లో హాజరు పరచగా..విచారించిన కోర్ట్ అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో రాఘవను భద్రాచలం సబ్‌ జైలుకు పోలీసులు తరలించారు. మరోపక్క రామకృష్ణ ఆత్మహత్య చేసుకోబోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలు బయటకొస్తున్నాయి.

రెండు రోజుల క్రితం ఓ వీడియో బయటకు రాగా..శనివారం మరో వీడియో బయటపడింది. ఈ వీడియో లో పలు సంచలన విషయాలు రామకృష్ణ తెలిపారు. తన అక్క మాధవితో..రాఘవ కు గతః 20 ఏళ్లుగా అక్రమసంబంధం ఉందని తెలిపాడు. భార్య, పిల్లలతో సహా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవనేనా తేల్చి చెప్పాడు. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానని పేర్కొన్నాడు.. తన బలవన్మరణానికి సూత్రధారి రాఘవేనని ఆరోపించారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారని ఆవేదిన వ్యక్తం చేశాడు.. ఇక, తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దంటూ వేడుకున్నారు.

Leave a Reply